ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన: వర్ల

ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని జాతీయ మానవహక్కుల కమిషన్‌కు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. ...

Updated : 03 Oct 2020 10:56 IST

అమరావతి: ఏపీలో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని జాతీయ మానవహక్కుల కమిషన్‌కు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. దీనిపై ప్రత్యేక కమిటీతో దర్యాప్తు జరిపించాలని ఆయన కోరారు. ఏపీలో  “భావ వ్యక్తీకరణ స్వేఛ్చ”ను పూర్తిగా హరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎస్సీలపై వరుస దాడులను అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఎస్సీ కుటుంబo సజీవదహనానికి  ప్రయత్నించినా ఈ ప్రభుత్వంలో చలనం రాలేదని, శిరోముండనం కేసులో అసలు ముద్దాయిలు అరెస్టు కాలేదని వర్ల విమర్శించారు. రాష్ట్రంలో “రూల్ ఆఫ్ లా” అమలు కావడంలేదని హైకోర్టే వ్యాఖ్యానించిందని ఆయన అన్నారు. డీజీపీని కూడా పలుదఫాలు హైకోర్టుకి పిలిచి, హెచ్చరించినా ప్రభుత్వ పాలనలో మార్పురాలేదని వర్లరామయ్య లేఖలో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని