సీఎం జగన్‌ వైఖరి మార్చుకోవాలి: వర్ల

గుంటూరులో రైతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లిన ఘటనపై తెలుగుదేశం పార్టీ (తెదేపా) సీనియర్‌ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు...

Published : 29 Oct 2020 01:56 IST

అమరావతి: గుంటూరులో రైతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లిన ఘటనపై తెలుగుదేశం పార్టీ (తెదేపా) సీనియర్‌ నేత వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతుల చేతులకు సంకెళ్లు వేసిన దృశ్యాలను జతపరుస్తూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఆయన లేఖ రాశారు. కరుడగట్టిన నేరస్థులు, దేశ భద్రతకు భంగం కలిగించే వారికి వేసినట్లుగా అమరావతి రైతులకు సంకెళ్లు వేయడం అత్యంత దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక ధోరణికి ఈ సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పటికైనా రైతుల పట్ల తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పెడచెవిన పెట్టి రైతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లడం న్యాయవ్యవస్థను ధిక్కరించడమే అవుతుందని లేఖలో పేర్కొన్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ వెంటనే స్పందించి ఈ విషయంలో సరైన చర్యలు తీసుకోవాలని వర్ల కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని