దళారులపై పీడీ యాక్ట్‌ నమోదుచేస్తాం: తలసాని

నగరంలోని గోడెకి ఖబర్‌లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు అందజేశారు...

Published : 29 Oct 2020 01:59 IST

హైదరాబాద్‌: నగరంలోని గోడెకి ఖబర్‌లో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గోడెకి ఖబర్‌లో 192 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని, ఇప్పటికే పూర్తైన 139 ఇళ్లను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వృద్ధులు, వికలాంగులకు కేటాయించనున్నట్లు మంత్రి వివరించారు. ఈ సందర్భంగా ఇవాళ ‘మిగిలిన ఇళ్లు.. దళారుల కళ్లు’ పేరుతో ‘ఈనాడు’ దినపత్రికలో వచ్చిన కథనానికి మంత్రి స్పందించారు. జియాగూడలో దళారులు రెచ్చిపోతున్నారని వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామన్నారు. ప్రజలు అలాంటి వారిని నమ్మొద్దని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్‌, కలెక్టర్‌ మహంతి తదితరులు పాల్గొన్నారు. 

ఇదీ చదవండి..
మిగిలిన ఇళ్లు.. దళారుల కళ్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని