BJP BJP BJP.. ఎక్కడికెళ్లినా ఈ పేరే

రాజస్థాన్‌ అధికార పార్టీ కాంగ్రెస్‌కు గట్టి షాకిస్తూ అక్కడి స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు

Published : 09 Dec 2020 16:04 IST

రాజస్థాన్‌ ఎన్నికల ఫలితాలపై జావడేకర్‌ హర్షం

జైపూర్‌: రాజస్థాన్‌ అధికార పార్టీ కాంగ్రెస్‌కు గట్టి షాకిస్తూ అక్కడి స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. ప్రాంతమేదైనా గెలుపు భాజపాదేనని.. తమ పార్టీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ప్రజలు ఎప్పుడూ మద్దతిస్తూనే ఉంటారని ఆయన అన్నారు.

రాజస్థాన్‌ స్థానిక ఎన్నికల ఫలితాలపై జావడేకర్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తెలంగాణలోని దుబ్బాక ఉప ఎన్నిక, అరుణాచల్‌ప్రదేశ్‌ స్థానిక పోరు.. ఇప్పుడు రాజస్థాన్‌ స్థానిక ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించడం దేశ ప్రజల అభీష్టానికి అద్దంపడుతోంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ను భాజపా గట్టిగా ఓడించింది. తెలంగాణ విషయానికొస్తే.. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలవడమేగాక, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ 49 సీట్లు సాధించింది. ఇక అరుణాచల్‌ప్రదేశ్‌ స్థానిక ఎన్నికల్లోనూ పలు సీట్లలో భాజపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  తూర్పు, దక్షిణం, ఉత్తరం.. ఎక్కడికెళ్లినా భాజపా, భాజపా, భాజపానే’ అని ఆనందం వ్యక్తం చేశారు. 

‘భాజపా, మా పార్టీ సంస్కరణలతో యావత్ దేశ ప్రజలకు ఆనందంగా ఉన్నారు. ప్రతిపక్షాల ప్రతికూల రాజకీయాలను ఓటర్లు తిరస్కరించారు. కరోనా, ఆర్థిక మందగమనం, వలసకూలీల సమస్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అర్థంలేని దాడి చేస్తున్నా ప్రజలు మా వెంటే ఉన్నారు. వ్యవసాయ సంస్కరణలపై దేశ ప్రజలు సానుకూలంగా ఉన్నారనడానికి తాజా విజయాలే నిదర్శనం’ అని ప్రకాశ్‌ జావడేకర్‌ చెప్పుకొచ్చారు. రాజస్థాన్‌లో మొత్తం 33 జిల్లాలు ఉండగా.. ఇటీవల 21 జిల్లాల్లో పంచాయతీ సమితీ, జిల్లా పరిషత్‌ ఎన్నికలు జరిగాయి. ఇందులో 14 జిల్లాల్లో భాజపా విజయం సాధించింది. 

ఇవీ చదవండి..

విపక్షాలది కపట బుద్ధి

రాష్ట్రంలో వచ్చేది భాజపా ప్రభుత్వమే: బండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని