Updated : 27 Oct 2020 14:08 IST

తేజస్వీ.. మీ తల్లిదండ్రులంటే నామోషీయా?

 

 

పుర్నియా: కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌పై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీ ఎన్నికల ప్రచార చిత్రాల్లో తేజస్వీ తల్లిదండ్రులు లాలూ ప్రసాద్‌ యాదవ్‌, రబ్రీ దేవిల చిత్రాలు లేకపోవడంపై మంత్రి ప్రశ్నించారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన కన్నవారికి తగిన మర్యాద ఇవ్వకపోవటం సరికాదన్నారు.

బిహార్‌లోని పుర్నియా నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి తరఫున భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలసి రవి శంకర్‌ ప్రచారం నిర్వహించారు. ఆ సందర్భంగా లాలు, రబ్రీలు బిహార్‌కు 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన విషయాన్ని గుర్తుచేశారు. ‘‘ఈయన కొత్త బిహార్‌ను నిర్మిస్తామని వాగ్దానాలు చేస్తున్నారు.. కానీ ఆ కొత్త బిహార్‌ పోస్టర్‌లో చెరో ఏడున్నర సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించిన ఆయన తల్లిదండ్రుల చిత్రాలు మాత్రం కనిపించడం లేదు. మీ తల్లిదండ్రుల చిత్రాల పట్ల  నీవెందుకు సిగ్గుపడుతున్నావు?’’ అని తేజస్వీ యాదవ్‌ను ప్రశ్నించారు.

‘పుర్నియా ప్రజలు వారి చిత్రాలను చూస్తే భట్టా బజార్‌ అపహరణల గురించి ప్రశ్నిస్తారు.. నాటి సంఘటనలతో భయభ్రాంతులైన ప్రజలు ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయిన సంగతిని గుర్తుచేసుకుంటారు. అందుకే వారి చిత్రాలను ప్రదర్శించేందుకు తేజస్వీ యాదవ్‌ వెనకాడుతున్నారని’ కేంద్ర మంత్రి వివరించారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఇక్కడ వ్యాపారాభివృద్ధి జరుగుతుందని.. ఇక ఎవరిని అధికారంలోకి తీసుకురావాలో పుర్నియా ప్రజలే నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు. సరైన వారిని ఎంపిక చేసుకోకుంటే అపహరణల సంస్కృతే పునరావృతమవుతుందని మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌  హెచ్చరించారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని