​​​​మరి మధ్య తరగతికేది వడ్డీ మాఫీ?: రాహుల్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్రంపై మరోసారి విమర్శలు గుప్పించారు. మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ చెల్లింపు విషయంలో కేంద్రం వైఖరిని తప్పుబట్టారు. బడా పారిశ్రామిక వేత్తలకు లక్షల కోట్ల రూపాయలు.

Published : 27 Aug 2020 18:30 IST

దిల్లీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్రంపై మరోసారి విమర్శలు గుప్పించారు. మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ చెల్లింపు విషయంలో కేంద్రం వైఖరిని తప్పుబట్టారు. బడా పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రూపాయలు పన్ను రాయితీలు ఇచ్చారని, మధ్యతరగతికి మాత్రం ఊరట కల్పించడం లేదని విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు.

‘‘బడా వ్యాపారులకు 1.45 లక్షల కోట్లు పన్నుల రూపంలో రాయితీలు ఇచ్చారు. మధ్య తరగతి తీసుకునే రుణాలకు మాత్రం రుణాలపై వడ్డీ మాఫీ చేయరు’’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. ‘సూట్‌ బూట్‌ సర్కార్‌’ అంటూ మరోసారి విమర్శలు చేశారు. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన వార్తలను ట్వీట్‌కు జత చేశారు.

మారటోరియం వ్యవధిలో రుణాలపై వడ్డీ చెల్లింపు విషయంలో కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆర్బీఐ పేరు చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించొద్దంటూ చురకలంటించింది. వారంలోగా సమాధానం ఇవ్వాలంది. ఈ నేపథ్యంలో రాహుల్ ఈ విధంగా ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు