నేను షేర్‌-ఈ-కశ్మీర్‌ బిడ్డని..

జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అగ్రనేత, ఎంపీ ఫరూక్ అబ్దుల్లా తాను ఎవరి ముందూ తలొగ్గబోనన్నారు.

Published : 24 Dec 2020 01:01 IST

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అగ్రనేత, ఎంపీ ఫరూక్ అబ్దుల్లా తాను ఎవరి ముందూ తలొగ్గబోనన్నారు. బుధవారం ఎన్సీ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. తనపై ఈడీ దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు. ‘‘నాపై ఏవో ఆరోపణలు చేస్తే వారి ముందు మోకరిల్లుతానని వారు భావిస్తున్నట్లున్నారు. కానీ నేను దేవుడి ముందు తప్ప ఎక్కడా తల దించను. నన్ను భయపెట్టాలనుకున్న వారికి చెప్తున్నా.. నేను షేర్‌-ఈ-కశ్మీర్‌ బిడ్డని.’’ అని ఫరూక్‌ అబ్దుల్లా అన్నారు. తాజాగా విడుదలైన డీడీసీ ఫలితాలు పార్టీ, పీఏజీడీ కూటమి సరైన దారిలోనే వెళ్తున్నాయని నిరూపించాయన్నారు. మనం ప్రచారం చేయడానికి బయటకు వెళ్లకపోయినా ప్రజలు మనల్ని నమ్మారన్నారు. ఇది జమ్మూ కశ్మీర్‌ ప్రజల విజయమని తెలిపారు. ఈ కూటమి కోసం ఎన్నో త్యాగాలు చేశామన్నారు. మంచి కోసం కొన్ని త్యాగాలు చేయక తప్పలేదన్నారు. ‘‘ఎన్సీ పార్టీ ఇకపై ఉండదని భాజపా అంటోంది. ఇదే మాటను 1992లో కూడా అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు అన్నారు. కానీ ప్రస్తుతం ఎన్సీ ఉంది. గతంలో ఉంది. భవిష్యత్తులో కూడా ఉంటుంది.’’ అని ఫరూక్‌ అన్నారు. మంచి కోసం పోరాడుతున్నపుడు కొన్ని సవాళ్లు ఎదురవుతాయని, వాటిని తట్టుకొని ముందుకు సాగిపోవాలని ఫరూక్‌ అబ్దుల్లా ఎన్సీ కార్యకర్తలకు సూచించారు. జమ్మూకశ్మీర్‌ క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన దర్యాప్తులో ఫరూక్‌ అబ్దుల్లా, తదితరులకు చెందిన రూ.11.86 కోట్ల విలువైన ఆస్తులను శనివారం ఈడీ జప్తు చేసింది.

ఇవీ చదవండి..

‘కొత్త కష్టం’: 8 గంటలకు పైగా ఎయిర్‌పోర్టులోనే..

వేర్పాటువాదులకు చెంపపెట్టులాంటి తీర్పు:ప్రసాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని