తుది శ్వాస దాకా వారి వెన్నంటే..: మమత

రైతులే భారతదేశానికి వెన్నెముక అని.. తన తుదిశ్వాస వరకు తాను, తన పార్టీ వారి వెన్నంటే ఉంటామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా ........

Published : 02 Oct 2020 19:20 IST

కోల్‌కతా: రైతులే భారతదేశానికి వెన్నెముక అని.. తన తుదిశ్వాస వరకు తన పార్టీ, తాను వారి వెన్నంటే ఉంటామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లాల్‌ బహుదూర్‌ శాస్త్రి ఇచ్చిన ‘జై జవాన్‌ - జై కిసాన్‌’ నినాదాన్ని, దేశానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు. 55 ఏళ్ల క్రితం ఆయన ఇచ్చిన ఈ నినాదం దేశంలోని సైనికులు, రైతాంగానికి ఎంతో ఉత్తేజాన్ని, ప్రేరణను ఇవ్వడంతో పాటు రైతు సోదరులను గర్వపడేలా చేసిందన్నారు. సమాజానికి రైతన్నే వెన్నెముక అన్న దీదీ.. తమ రాష్ట్రంలో రైతుల వార్షిక సగటు ఆదాయాన్ని మూడింతలు చేసినట్టు తెలిపారు. 2011లో రైతుల వార్షిక ఆదాయం రూ.91వేలుగా ఉంటే 2018 నాటికి అది రూ.2.91లక్షలకు పెరిగిందని చెప్పారు. రైతుల ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలకు ఇదే నిదర్శనమన్నారు. రైతాంగం తరఫున తమ గళాన్ని వినిపిస్తూనే ఉంటామని మమత స్పష్టంచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని