అప్పుడెందుకు ఇలా సంప్రదించలేదు: వైకాపా

స్థానిక ఎన్నికల కోసం అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ)‌.. వాటిని వాయిదా వేసేముందు ఎందుకు

Published : 29 Oct 2020 01:56 IST

అమరావతి: స్థానిక ఎన్నికల కోసం అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరిస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్‌ఈసీ)‌.. వాటిని వాయిదా వేసేముందు ఎందుకు సంప్రదించలేదని వైకాపా ప్రశ్నించింది. రాష్ట్రంలో వేలాదిగా కరోనా కేసులు నమోదవుతుంటే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరమేంటని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైకాపా సిద్ధంగా ఉందని.. కావాలంటే తిరుపతి ఉప ఎన్నికలో తెదేపా పోటీ చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్‌ వ్యక్తిగత ఆలోచనతో ముందుకెళుతున్నారని కన్నబాబు ఆరోపించారు. 

వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ స్థానిక ఎన్నికలను వాయిదా వేసే సమయంలో మూడు నాలుగు కేసులున్నాయని.. ఇప్పుడు రోజుకు మూడువేల కేసులు నమోదవుతున్నాయని గుర్తు చేశారు. ఎన్నికల కమిషనర్‌ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు. ఎస్‌ఈసీ ఇప్పుడు అనుసరిస్తు్న్న ప్రక్రియను గతంలో ఎందుకు ఆచరించలేదని అంబటి రాంబాబు ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని