ప్రభుత్వం అనుకున్నట్టే స్థానిక ఎన్నికలు: విజయసాయి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ ఉండాలని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. విశాఖ

Published : 20 Dec 2020 02:49 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ ఉండాలని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. విశాఖ అంశంలో ఎవరిని సంప్రదించాలో వారిని ప్రభుత్వం సంప్రదించిందని.. ఈ నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరన్నారు. విశాఖలో మంత్రి అవంతితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్ణయించిన మేరకు శాసన రాజధాని విజయవాడలోనే ఉంటుందని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు సుప్రీంకోర్టు అనుమతి కావాలన్నారు. అలాగే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్లే జరుగుతాయన్నారు. ఎన్నికల అంశం ప్రస్తుతం న్యాయస్థానంలో ఉందని.. అన్నీ పరిష్కారం అయ్యాక ప్రభుత్వం అనుకున్నట్లు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని