రాష్ట్రాన్ని జగన్‌ అప్పుల్లో ముంచారు‌: యనమల

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిపై తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన ముఖ్యమంత్రిగా జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా...

Published : 30 Sep 2020 14:49 IST

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డిపై తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని రూ.10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన ముఖ్యమంత్రిగా జగన్‌ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెచ్చిన అప్పులను రాష్ట్రాభివృద్ధిపై ఖర్చు పెట్టకుండా జగన్‌ అనుచరులకే పంచి పెడుతున్నారని విమర్శించారు. తెదేపా పాలనలో ఏడాదికి రూ.26వేల కోట్ల అప్పులు చేస్తే.. వైకాపా పాలనలో ఏడాదికి రూ1.13లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. పేదల ఆర్థికాభివృద్ధికి గండి కొట్టి పెద్దలకు దోచిపెడుతున్నారని యనమల మండిపడ్డారు.    

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని