కోర్టు నిర్ణయాలను గవర్నర్‌ గౌరవించాలి

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ను పునర్నియమించడం తప్ప ప్రత్యామ్నాయం లేదని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు.

Updated : 17 Jul 2020 22:06 IST

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌ను పునర్నియమించడం తప్ప ప్రత్యామ్నాయం లేదని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు కూడా సమర్థించిందని గుర్తు చేశారు.అంతేకాకుండా న్యాయస్థానం నిర్ణయాలను గవర్నర్‌ గౌరవించాలన్నారు. తనను ఎస్‌ఈసీగా పునర్నియమించాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు లేఖను జతచేస్తూ.. నిమ్మగడ్డ సోమవారం గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు.

ఏపీలో అరాచక పాలన: ఆదినారాయణ రెడ్డి
ఏపీలో అరాచక పాలన సాగుతోందని భాజపా నేత ఆదినారాయణ రెడ్డి అన్నారు. నిమ్మగడ్డను రాజ్యాంగ విరుద్ధంగా పదవి నుంచి తొలగించారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా నేత సంతోష్‌ను కడప భాజపా నేతలు దిల్లీలో కలిశారు. ప్రశ్నించిన వారిపై కేసులతో భయపెట్టిస్తున్నారని, ఏపీలో పరిస్థితులను కేంద్ర మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తామని ఆదినారాయణరెడ్డి అన్నారు. ఏపీలో భూములు అమ్మకాల కొనుగోళ్లలో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని