TDP: దిల్లీకి తెదేపా నేతల బృందం

ఓటర్ల జాబితాలో అక్రమాలపై సీఈసీకి తెదేపా ఫిర్యాదు చేయనుంది. ఈ మేరకు తెదేపా నేతల బృందం మంగళవారం దిల్లీకి వెళ్లనుంది.

Published : 20 Nov 2023 18:00 IST

అమరావతి: తెదేపా నేతల బృందం మంగళవారం దిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనుంది. ఓటర్ల జాబితాలో అక్రమాలు, ఫాం - 6, 7 అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేయనుంది. బీఎల్‌వోలపై ఒత్తిడి తెచ్చి ఓట్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లనుంది. దిల్లీకి వెళ్లే తెదేపా బృందంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని