Chandrababu: హైదరాబాద్‌లో చంద్రబాబుకు ఘనస్వాగతం.. భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులు

ఏపీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్‌లో తెదేపా శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది.

Updated : 05 Jul 2024 21:32 IST

హైదరాబాద్‌: ఏపీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్‌లో తెదేపా శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది. దిల్లీ పర్యటన ముగించుకుని బేగంపేట విమనాశ్రయానికి చేరుకున్న ఆయనకు తెలంగాణ తెదేపా నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారి నగరానికి వచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాహనంపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ చంద్రబాబు ముందుకు సాగారు. ఓ వైపు భారీ వర్షం కురుస్తున్నప్పటికీ లెక్క చేయకుండా అభిమానులు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం వరకు ర్యాలీ నిర్వహించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని