
Andhra News: అద్దంకి వైకాపా ఇన్ఛార్జ్కు నిరసన సెగ.. మెల్లగా జారుకున్న నేత
అద్దంకి: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న అధికార పార్టీ నేతలకు నిరసన సెగ ఎదురవుతూనే ఉంది. కొన్ని చోట్ల వైకాపా నేతలపై ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా.. మరికొన్ని చోట్ల తమ సమస్యలను ప్రజలు ఎకరువు పెడుతున్నారు. తాజాగా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం కుందుర్రులో అధికార పార్టీ నేతలను తమ సమస్యలపై పలువురు ప్రశ్నించారు.
అద్దంకి వైకాపా ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్యను ఓ మహిళ నిలదీశారు. వీవోఏగా ఎప్పట్నుంచో తాను పని చేస్తున్నా.. జీతాలు సరిగా ఇవ్వడం లేదని వాపోయారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా సమస్య పరిష్కారం కాలేదని వారించారు. తమపై తెదేపా ముద్ర వేసి జీతాలు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ముస్లిం మహిళ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక కృష్ణ చైతన్య అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Udaipur Murder: దర్జీ హత్య కేసు.. హంతకులకు అంతర్జాతీయ సంబంధాలు: సీఎం అశోక్ గహ్లత్
-
Business News
Twitter: జులై 4 డెడ్‌లైన్.. ఇదే చివరి నోటీస్: ట్విటర్‌కు కేంద్రం హెచ్చరిక
-
Business News
Rupee value: ఆల్ టైమ్ కనిష్ఠానికి రూపాయి.. 79కి చేరిన విలువ!
-
General News
Andhra News: ఉద్యోగుల ఖాతాల్లో నగదు ఏమైంది?.. ఇంకా స్పష్టత ఇవ్వని ఆర్థికశాఖ
-
Movies News
Happy Birthday: గన్లతో ఫన్.. ‘హ్యాపీ బర్త్‌డే’ ట్రైలర్ చూశారా..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Actress Meena: ఊపిరితిత్తుల సమస్యతో నటి మీనా భర్త మృతి
- Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
- Actress Meena: మీనా భర్త మృతి.. పావురాల వ్యర్థాలే కారణమా..?
- Udaipur Murder: భగ్గుమన్న ఉదయ్‌పుర్
- Plastic Ban: జులై 1 నుంచి దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ నిషేధం.. ఏయే వస్తువులంటే..!
- IND vs IRE : అందుకే ఆఖరి ఓవర్‌ను ఉమ్రాన్‌కు ఇచ్చా : హార్దిక్ పాండ్య
- DilRaju: తండ్రైన దిల్‌రాజు.. మగబిడ్డకు జన్మనిచ్చిన తేజస్విని
- ఒత్తిళ్లకు లొంగలేదని బదిలీ బహుమానం!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-06-22)
- IND vs IRE : గెలిచారు.. అతి కష్టంగా