Aaditya Thackeray: రాజీనామా చేసి నాపై పోటీ చెయ్‌.. సీఎంకు ఆదిత్య సవాల్‌!

రాజీనామా చేసి తనపై వర్లీ నుంచి పోటీ చేయాలని శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray).. మహారాష్ట్ర ఉమఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde)కు సవాల్‌ విసిరారు.

Published : 05 Feb 2023 11:22 IST

ముంబయి: శివసేన (ఉద్ధవ్‌ బాల్‌ ఠాక్రే) నేత ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray).. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde)పై నిప్పులు చెరిగారు. ఆయన్ని రాజ్యాంగ విరుద్ధ సీఎంగా అభివర్ణించారు. వర్లీ నియోజకం వర్గం నుంచి తనపై పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. పార్టీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో శనివారం మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

శివసేన (Shiv Sena)పై తిరుగుబాటు చేసిన ఇతర ఎమ్మెల్యేలకు సైతం ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) ఇదే తరహా సవాల్‌ విసిరారు. తన తండ్రి ఉద్ధవ్‌ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలన్నారు. తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి తాజాగా ప్రజల మద్దతు కోరాలన్నారు. ‘‘వర్లీ నుంచి నేను రాజీనామా చేస్తాను. నాపై పోటీకి సిద్ధమవ్వాలని ఈ రాజ్యాంగ విరుద్ధ సీఎంకు సవాల్‌ విసురుతున్నాను. ఆయన ఎలా గెలుస్తారో నేనూ చూస్తాను. తిరుగుబాటు చేసిన 13 మంది ఎంపీలు, 40 మంది ఎమ్మెల్యేలకు కూడా అదే సవాల్‌ విసురుతున్నాను. రాజీనామా చేసిన మళ్లీ పోటీ చేయండి. గెలుస్తారేమో చూద్దాం’’ అని ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు.

ఉద్ధవ్‌ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్‌ ఆఘాడీ కూటమి ప్రభుత్వంపై 2022 జూన్‌లో ఏక్‌నాథ్‌ శిందే (Eknath Shinde) సహా ఆయన మద్దతుదారులు తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. తర్వాత భాజపా మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. శిందే (Eknath Shinde) ముఖ్యమంత్రిగా.. భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని