Politics: కాంగ్రెస్‌కు సిద్ధూ గుడ్‌ బై?

పంజాబ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ నేత నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూ ఆప్‌ గూటికి చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌ దీనికి మరింత బలం చేకూర్చుతోంది. తన పని తీరును ఆమ్ఆద్మీ పార్టీ గుర్తించిదని, రాష్ట్రం కోసం ఎవరు పోరాడుతున్నారో...

Published : 14 Jul 2021 01:19 IST

దిల్లీ: పంజాబ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ నేత నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూ ఆప్‌ గూటికి చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌ దీనికి మరింత బలం చేకూర్చుతోంది. తన పని తీరును ఆమ్ఆద్మీ పార్టీ గుర్తించిందని, రాష్ట్రం కోసం ఎవరు పోరాడుతున్నారో ఆప్‌ పార్టీకి బాగా తెలుసని ఆయన పేర్కొన్నారు.

‘‘ నా దూరదృష్టిని, పనితీరును ఆమ్‌ఆద్మీ పార్టీ ఎప్పటికప్పుడు గుర్తిస్తోంది. మాదకద్రవ్యాలు, రైతు సమస్యలు, అవినీతి, విద్యుత్‌  ఇలా ప్రతి అంశంలోనూ పంజాబ్‌ రాష్ట్ర ప్రజల పక్షాన తాను ఎలా పోరాడుతున్నానో ఆప్‌ నిశితంగా గమనిస్తోంది. రాష్ట్రం కోసం నిస్వార్థంగా ఎవరు పని చేస్తున్నారో వారికి తెలుసు’’ అంటూ సిద్ధూ ట్వీట్‌ చేశారు. 2017లో భాజపాను వీడి కాంగ్రెస్‌లో చేరిన సమయంలో సిద్ధూను ఆప్‌ నేత సంజయ్‌ సింగ్ అభినందించారు. ఆకాలీదళ్‌కు, బాదల్‌ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమవ్వడాన్ని ప్రశంసిస్తూ అప్పట్లో ట్వీట్‌ చేశారు. దానికి సమాధానంగా సిద్ధూ ప్రస్తుతం రీట్వీట్‌ చేయడం విశేషం.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంజాబ్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల కారణంగా తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ముఖ్యమంత్రి  అమరీందర్‌సింగ్‌కు, నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూకు మధ్య ఏర్పడిన విభేదాలను చక్కదిద్దేందుకు అధిష్ఠానం ప్రయత్నించింది. వారం రోజుల క్రితం అమరీందర్‌తో సోనియాగాంధీ దాదాపు 90 నిమిషాల పాటు చర్చించారు. రాహుల్‌ గాంధీ చొరవతో నవ్‌జోత్‌సింగ్‌కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ, తాజాగా సిద్ధూ చేసిన ట్వీట్‌.. ఆయన కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి ఆప్‌లో చేరుతారనే ఊహాగానాలకు ఊతమిస్తోంది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని