కాంగ్రెస్‌కే ఆప్‌ పెద్ద ఛాలెంజ్‌‌: రూపానీ 

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు ఆమ్‌ ఆద్మీ పార్టీ పెద్ద ఛాలెంజ్‌గా మారిందని గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ వ్యాఖ్యానించారు. సూరత్.....

Published : 25 Feb 2021 01:52 IST

అహ్మదాబాద్‌: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌కు ఆమ్‌ ఆద్మీ పార్టీ పెద్ద ఛాలెంజ్‌గా మారిందని గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ వ్యాఖ్యానించారు. సూరత్ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌ 27 స్థానాల్లో విజయం సాధించడంపై ఆయన స్పందించారు. గతంలో కాంగ్రెస్‌ గెలిచిన స్థానాలనే ఆప్‌ అభ్యర్థులు గెలుచుకున్నారన్నారు. ఆప్‌తో కాంగ్రెస్‌కు పెద్ద సవాల్‌ తప్ప భాజపాకు కాదన్నారు. బావ్లా సమీపంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు.

కాంగ్రెస్‌ కోటను కూల్చిన ఆప్‌.. గుజరాత్‌లో హస్తానికి ప్రత్యామ్నాయంగా మారిందని అభిప్రాయపడ్డారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సూరత్‌ మినహా ఇంకే నగరంలోనూ ఆప్‌ ఒక్కస్థానంలో కూడా గెలవలేదన్నారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మాదిరిగానే గ్రామీణ ప్రాంతాల్లోనూ భాజపా హవా కొనసాగిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ నెల 28న 81 మున్సిపాల్టీలు, 31 జిల్లా పంచాయతీలు, 231 తాలుకా పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని