AAP: భాజపా రెండింట్లో ఓడి.. ఒక దగ్గరే గెలిచింది: రాఘవ్ చద్దా
రెండు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచినప్పటికీ గుజరాత్ కోటలోకి ప్రవేశించడం ఒక ఆనందంగా ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కీలక నేత, ఎంపీ రాఘవ్ చద్ధా పేర్కొన్నారు. భాజపా రెండు చోట్ల ఓడిపోయి కేవలం ఒకచోట మాత్రమే(గుజరాత్) గెలిచిందన్నారు.
దిల్లీ: రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశపరిచినప్పటికీ గుజరాత్ కోటలోకి ప్రవేశించడం ఆనందంగా ఉందని అని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కీలక నేత, ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. భాజపా ఒకచోట గెలిచి సంబరాలు చేసుకుంటున్నప్పటికీ రెండు చోట్ల ఓడిందని గుర్తుచేశారు. ఎన్నికల ఫలితాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా గుజరాత్లో భారీ మెజార్టీతో గెలిచిన భాజపాకు ఆయన అభినందనలు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఒక్క స్థానంలోనూ విజయం సాధించకపోవడం నిరూత్సాహ పరిచిందన్నారు.
2012లో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించిన కొద్ది కాలంలోనే జాతీయ స్థాయి గుర్తింపు పొందడం పెద్ద మైలురాయి అని రాఘవ్ చద్దా అన్నారు. కేవలం ఐదు స్థానాల్లోనే గెలిచినప్పటికీ గుజరాత్ కోటలో ప్రవేశించామన్నారు. గుజరాత్లో 13 శాతం ఓట్లు సాధించడమంటే లక్షల మంది ఓటర్లు తమ పార్టీని ఆదరించారని పేర్కొన్నారు. అయితే గుజరాత్లో తాము అనుకున్నంత స్థాయిలో ఓట్లు రాలేదు అని చద్దా తెలిపారు. గెలవకపోవడం బాధగా ఉన్నప్పటికీ గుజరాత్లో కోటలో ప్రవేశించడం ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు గుజరాత్ బయట నుంచి పోరాడామని, వచ్చే ఎన్నికల్లో గుజరాత్ కోటలోపటి నుంచే పోరాడతామన్నారు. దేశంలోనే ఆప్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతుందోన్నారు. పలు ప్రాంతీయ పార్టీలకు సాధ్యం కానిది తమ పార్టీకి సాధ్యమైందన్నారు. గుజరాత్లో విజయం సాధించడంతో నరేంద్ర మోదీ సారథ్యంలోని భాజపా శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు అయితే ఆ పార్టీ కేవలం ఒక దగ్గర మాత్రమే గెలిచి, రెండింటిలో ఓడిపోయిందని (దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు) రాఘవ్ చద్దా గుర్తుచేశారు.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ భారీగా ఆశలు పెంచుకున్నప్పటికీ ఓటర్లు తిరస్కరించారు. గుజరాత్‌లోని అన్ని స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ కేవలం 5 స్థానాల్లోనే నెగ్గింది. మోదీ సారథ్యంలోని కమలనాథులు 156 సీట్లతో ఎన్నడూ లేనంత మెజారిటీని కైవసం చేసుకున్నారు. ఇక కాంగ్రెస్ 17 సీట్లకు పరిమితమైంది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లో ఆప్ ఖాతా కూడా తెరవలేదు. 68 స్థానాల్లో ఒక్కటంటే ఒక్కస్థానంలోనూ ఆ పార్టీ అభ్యర్థులు విజయాన్ని అందుకోలేకపోయారు. 40 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ విజయం సాధించగా, 25 స్థానాలతో భాజపా రెండో స్థానంలో నిలిచింది. అయితే గుజరాత్ ఎన్నికలను కీలకంగా భావించిన ఆప్ కన్వీనర్, దీల్లీ సీఎం కేజ్రీవాల్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. భాజపాకు తామే ప్రత్యామ్నాయం అని ప్రచారం చేసినప్పటికీ గుజరాత్ ఓటర్లు తిరస్కరించారు. ఈ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ గుజరాత్లో 13 శాతం ఓట్లను రాబట్టి ఆప్ జాతీయస్థాయి పార్టీ హోదా గుర్తింపును సంపాదించింది. ఈ ఎన్నికల్లో ఆప్‌కు ఇదే ఉత్సాహన్ని ఇచ్చే అంశం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
K Viswanath: విశ్వనాథ్ ‘S’ సెంటిమెంట్.. ఆ రెండు చిత్రాల విషయంలో నెరవేరని కల!
-
General News
Krishna Tribunal: కొత్త కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలా? వద్దా?.. అభిప్రాయం వెల్లడించని ఏజీ
-
India News
Parliament: అదానీ ఎఫెక్ట్.. సోమవారానికి వాయిదా పడిన ఉభయ సభలు
-
World News
Putin: 80 ఏళ్ల తర్వాత.. మళ్లీ సరిహద్దుల్లో వారి ట్యాంకులు..!
-
General News
TTD: తిరుమలలో ఆటోమేటిక్ యంత్రాలతో లడ్డూ తయారీ!
-
India News
SC: ఆ రికార్డులు సమర్పించండి.. బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీం నోటీసులు