ఆప్‌ ఎమ్మెల్యేకు రెండేళ్లు జైలు శిక్ష 

ఆప్‌ ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతికి దిల్లీ కోర్టు రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. 2016లో ఎయిమ్స్‌ భద్రతా సిబ్బందిపై దాడి కేసులో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌.......

Published : 23 Jan 2021 20:00 IST

దిల్లీ: ఆప్‌ ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతికి దిల్లీ కోర్టు రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. 2016లో ఎయిమ్స్‌ భద్రతా సిబ్బందిపై దాడి కేసులో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఆయనకు జైలు శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా కూడా విధించారు. అయితే, ఈ తీర్పునకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్‌ చేసుకొనేందుకు వీలుగా ఆయనకు బెయిల్‌ మంజూరైంది. 

2016 సెప్టెంబర్‌ 9న సోమనాథ్‌ భారతితో పాటు దాదాపు 300 మంది ఎయిమ్స్‌ వద్ద సరిహద్దు గోడను జేసీబీతో పడగొట్టేందుకు ప్రయత్నించారని, ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపై దాడి చేశారని ఆరోపిస్తూ కేసు నమోదైంది. ఎయిమ్స్‌ చీఫ్‌ సెక్యూరిటీ అధికారి ఆర్‌ఎస్‌ రావత్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేసినట్టు న్యాయస్థానం పేర్కొంది. సోమ్‌నాథ్‌ భారతితో పాటు ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న ఆయన సన్నిహితులు జగత్‌ సైనీ, దిలీప్‌ ఝా, సందీప్‌ సోనూ, రాకేశ్‌ పాండేకు వ్యతిరేకంగా ఆధారాలు లభ్యంకాకపోవడంతో వారిని నిర్దోషులుగా ప్రకటించింది. 

ఇదీ చదవండి..

మీ గ్రామంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడంటే?

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని