AAP: మాక్కూడా ప్రేమలేఖ అందింది..!

మొదటగా మోదీ ప్రభుత్వానికి ఇష్టమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి ఆప్‌ ప్రభుత్వానికి ప్రేమలేఖ అందింది. ఈ రోజు మధ్యాహ్నం 1.30 కి దిల్లీలోని ఆప్‌ ప్రధాన కార్యాలయంలో నేను ఒక ముఖ్యమైన మీడియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నాను.

Updated : 14 Sep 2021 01:56 IST

ఆప్‌కి ఈడీ నోటీసు..వ్యంగ్యంగా స్పందించిన పార్టీ నేత

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి ప్రేమ లేఖ అందిందని ఆ పార్టీ నేత రాఘవ్‌ చద్దా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) నుంచి ఆప్‌కు నోటీసు అందడాన్ని ఉద్దేశించి ఆయన ఈ విమర్శ చేశారు. ఈ మేరకు సోమవారం ట్విటర్ వేదికగా స్పందించారు. 

‘మొదటగా మోదీ ప్రభుత్వానికి ఇష్టమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి ఆప్‌ ప్రభుత్వానికి ప్రేమలేఖ అందింది. ఈ రోజు మధ్యాహ్నం 1.30కి దిల్లీలోని ఆప్‌ ప్రధాన కార్యాలయంలో నేను ఒక ముఖ్యమైన మీడియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నాను. అందులో భాజపా రాజకీయ కుట్రలను బహిర్గతం చేయనున్నాను’ అంటూ చద్దా ట్వీట్ చేశారు. 

రాజకీయ నేతలకు దర్యాప్తు సంస్థల నోటీసులు ప్రేమ లేఖలే గానీ.. డెత్ వారెంట్లు కాదని గత నెల శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రేమలేఖ పదాన్ని చద్దా పునరుద్ఘాటించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని