Goa Elections: ₹10లక్షలు వస్తుంటే.. ఆ ₹2వేలు ఎందుకు?: కేజ్రీవాల్
త్వరలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరిగి రాష్ట్రాల్లో గోవా కూడా ఉంది. అయితే, దిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తొలిసారి గోవా ఎన్నికల బరిలో నిలవబోతుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా తరచూ గోవాలో పర్యటిస్తున్న దిల్లీ సీఎం, ఆప్
పనాజీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తొలిసారి బరిలో నిలవబోతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గోవాలో పర్యటిస్తున్న దిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే గోవాలోని యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం రాకపోతే నెలకు రూ. 3వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే భూహక్కుల సమస్యలను పరిష్కరిస్తామని, రైతులతో చర్చించి వారి సమస్యలనూ తీరుస్తామని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామంలో మొహల్లా క్లినిక్స్‌లో ప్రారంభించి ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తామని వెల్లడించారు. అంతేకాదు, 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. వెయ్యి ఆర్థిక సాయం చేస్తామన్నారు. 24/7 విద్యుత్, మంచినీటి సరఫరా, ఉచిత విద్య అందిస్తామని చెప్పారు. ఆప్‌కి ఓటు వేస్తే సంక్షేమ పథకాల ద్వారా గోవా ప్రజలకు రూ.10లక్షలు అందుతాయి. అలాంటప్పుడు రూ.2వేలు తీసుకొని ఇతర పార్టీలకు ఓటు వేయడమెందుకని ప్రశ్నించారు.
‘‘గతంలో గోవా ప్రజలకు భాజపా.. కాంగ్రెస్ తప్ప వేరే ప్రత్యామ్నాయం ఉండేది కాదు. ఆయా ప్రభుత్వాల తీరుతో వారు విరక్తి చెందారు. ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఎన్నికల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అవినీతి రహిత పాలన మా డీఎన్ఏలోనే ఉంది’’అని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
గోవాలోని 40 నియోజకవర్గాలకు ఫిబ్రవరి 14న ఒకేదశలో పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెల్లడవుతాయి. పశ్చిమబెంగాల్లోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. దీంతో గోవా ఎన్నికలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే
భాజపా ఇచ్చిన హామీలకు 2004 ఫలితాలే పునరావృతం అవుతాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. -
YSRCP: చిలకలూరిపేట పంచాయితీ.. మల్లెల రాజేశ్‌కు సీఎంవో నుంచి పిలుపు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైకాపా (YSRCP) పంచాయితీ తాడేపల్లికి చేరింది. అక్కడి వైకాపా నేత మల్లెల రాజేశ్ నాయుడుకు సీఎంవో నుంచి పిలుపు వచ్చింది. -
AP News: కాంగ్రెస్‌లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
నందికొట్కూరు వైకాపా ఎమ్మెల్యే ఆర్ధర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
Pashupati Paras: అబ్బాయితో భాజపా దోస్తీ.. కేంద్రమంత్రి పదవికి బాబాయ్ రాజీనామా
Pashupati Paras: కేంద్రమంత్రి పశుపతి కుమార్ పరాస్ తన పదవికి రాజీనామా చేశారు. బిహార్‌లో చిరాగ్ పాసవాన్‌కు చెందిన ఎల్జేపీ (రాంవిలాస్)తో భాజపా పొత్తు పెట్టుకోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. -
TDP: తెదేపా ఎంపీ అభ్యర్థులపై కసరత్తు.. సాయంత్రం ప్రకటన?
తెదేపా (TDP) ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) కసరత్తు చేస్తున్నారు. -
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు వైకాపా నేతలపై పోలీసులు సోమవారం కేసులు నమోదు చేశారు. -
సమస్యలు వింటూ.. భరోసా ఇస్తూ
ప్రజలతో మమేకమయ్యేందుకు తెదేపా ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ ఆ పార్టీ అభ్యర్థి లోకేశ్ సోమవారం ‘రచ్చబండ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ప్రధాని సభలో ఇంత భద్రతా వైఫల్యమా?
‘ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పాల్గొన్న ప్రజాగళం బహిరంగ సభలో అడుగడుగునా పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. సభలో ఎక్కడా ప్రజలను నియంత్రించే ప్రయత్నం చేయలేదు. -
జనం తోసుకుంటుంటే చోద్యం చూశారు
ప్రధాని మోదీ పాల్గొన్న బొప్పూడి ప్రజాగళం సభకు భద్రత కల్పించడంలో రాష్ట్ర పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ధ్వజమెత్తారు. -
ప్రభుత్వ వెబ్సైట్లలో ఫొటోలు తొలగించాలి
ప్రభుత్వశాఖల వెబ్సైట్లలో ముఖ్యమంత్రి, మంత్రుల ఫొటోలు ఉండడంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ)కి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. -
ప్రధాని సభకు ఆటంకాల వెనుక జగన్ హస్తం
ప్రధానమంత్రి పాల్గొన్న ప్రజాగళం సభకు ఆటంకాలు సృష్టించడం వెనుక ముఖ్యమంత్రి జగన్ హస్తం ఉందని మాజీ మంత్రి, తెదేపా నేత కొల్లు రవీంద్ర ఆరోపించారు. -
లక్షల మంది తరలివచ్చి కూటమిని ఆశీర్వదించారు
చిలకలూరిపేటలో భాజపా, తెదేపా, జనసేన కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ వంటిది ఈ దశాబ్దంలో చూడలేదని జనం చెబుతున్నారని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపు చేపడితే మేలు
ఏపీలో మే 13న ఎన్నికలు ముగిశాక సాధ్యమైనంత త్వరగా ఓట్ల లెక్కింపును చేపట్టాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిల్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. -
జగన్ అరాచక పాలనకు మోదీ అండ: సీపీఐ
వైఎస్ వివేకా హత్య కేసు నిందితులను సీబీఐ ఇంతవరకు గుర్తించకపోవడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. -
కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా అక్రమ మైనింగ్ యథావిధిగా జరుగుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. -
వైకాపా అధిష్ఠానానికి నగరి అసమ్మతి నేతల ఝలక్
చిత్తూరు జిల్లా నగరి సీటును మంత్రి రోజాకు కేటాయిస్తే తాము పని చేయమని వైకాపా అసమ్మతి నేతలు తెగేసి చెప్పినా, రెండ్రోజుల క్రితం ఆమె అభ్యర్థిత్వాన్నే జగన్ ఖరారు చేశారు. -
కడపలోనూ కొండలు కొల్లగొట్టేశారు...
ముఖ్యమంత్రి జగన్ సొంత ఇలాకా ఉమ్మడి కడప జిల్లాలో కొండలు, గుట్టలను వైకాపా నేతలు అయిదేళ్లుగా వరుసబెట్టి మింగేశారు. -
హిందూమతం అంతమే వారి లక్ష్యం
దేశంలో హిందూమతాన్ని, శక్తి ఆరాధనను అంతం చేసేందుకు ఇండియా కూటమి కంకణం కట్టుకుందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. -
ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవికి సవాంగ్ రాజీనామా చేయాలి
గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనం మూడుసార్లు చేస్తే ఒక్కసారే జరిగిందంటూ ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్‌సవాంగ్ బుకాయించడం సిగ్గుచేటని, ఆయనకు ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని.. తక్షణం రాజీనామా చేయాలని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ డిమాండ్ చేశారు. -
ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేని అసమర్థ సీఎం జగన్
జగన్‌రెడ్డి అయిదేళ్ల పాలనలో జలవనరుల రంగంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయకుండా రైతులకు కన్నీరు మిగిల్చారని జలవనరుల శాఖ మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. -
గెలుపే లక్ష్యంగా పని చేయాలి
సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, తెదేపా, భాజపా అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని జనసేన ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
Mallikarjun Kharge: భాజపా హామీలు.. 2004 ఫలితమే వస్తుంది: ఖర్గే
-
Flight Journey: ‘బరువు ఉన్నామని విమానం నుంచి దించేశారు’
-
YSRCP: చిలకలూరిపేట పంచాయితీ.. మల్లెల రాజేశ్‌కు సీఎంవో నుంచి పిలుపు
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
-
IPL-SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు షాక్.. మూడు మ్యాచ్‌లకు కీలక ఆటగాడు దూరం
-
AP News: కాంగ్రెస్‌లో చేరిన వైకాపా ఎమ్మెల్యే