Andhra News: అతి త్వరలో పార్టీ కార్యాలయం నుంచే ప్రకటన : సినీ నటుడు అలీ

సినీనటుడు, వైకాపా నేత అలీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. గత సాధారణ ఎన్నికల

Updated : 15 Feb 2022 18:18 IST

అమరావతి: సినీనటుడు, వైకాపా నేత అలీ కుటుంబ సమేతంగా ఇవాళ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... అలీకి రాజ్యసభ టికెట్‌ ఇస్తారనే ప్రచారంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా స్పష్టత ఇచ్చేందుకు నిరాకరించారు. రాజ్యసభ సీటు ఇస్తారనే విషయం తనకు తెలియదని, అలాంటి సంకేతాలు ఏవీ సీఎం ఇవ్వలేదని చెప్పారు. అతి త్వరలోనే పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు.

‘‘ఇవాళ మర్యాదపూర్వకంగా మాత్రమే సీఎంను కలిశా. వైఎస్‌ఆర్‌ సీఎం కాకముందు నుంచే వారి కుటుంబంతో పరిచయం ఉంది. 2004లో వైఎస్‌ఆర్‌ పాదయాత్ర చేసిన తర్వాత కలిశాను. పదవి ఇస్తేనే పార్టీలోకి వచ్చి సేవ చేస్తానని అనలేదు. గత సాధారణ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే టికెట్‌ ఆఫర్‌ చేశారు. సమయం లేక నేనే వద్దని చెప్పా. నిన్న ఏపీ సీఎం కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. అందుకే ఇవాళ కుటుంబ సమేతంగా వచ్చి సీఎంను కలిశా. కార్యాలయంలో పలువురు మంత్రులను కలిశాను. ప్రచారం సమయంలో కలిసి పనిచేసిన ఎమ్మెల్యేలను కలిశా. ఏమీ ఆశించకుండా పార్టీలోకి వచ్చాను. పదవి ఇస్తేనే పార్టీలోకి వచ్చి సేవ చేస్తానని అనలేదు. పదవి రానందుకు నాకు అసంతృప్తి ఉన్నట్టు ఎక్కడా చెప్పలేదు. సీఎం జగన్‌తో నాకు ముందు నుంచే పరిచయం ఉంది. ఇటీవల సినిమా ప్రముఖులను సీఎం పిలిచి అవమానించారన్నది అవాస్తవం. చిరంజీవి వచ్చినప్పుడు సీఎం చాలా గౌరవంగా చూశారు. ఏపీలో సినిమా టికెట్‌ ధరలు సామన్యుడికి అందుబాటులో ఉండాలనే సీఎం భావిస్తున్నారు.  సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలన్నీ ఇటీవల జరిగిన సమావేశంలో సీఎంకు వివరించాం. త్వరలో తెలుగు సినిమా కష్టాలు తీరతాయి’’ అని అలీ తెలిపారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని