Andhra News: ‘వైకాపాలో 49మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారు!’

అమరావతి రైతులు, మహిళల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని సినీ నటుడు శివాజీ అభినందించారు. పారిశ్రామికవేత్తలే రాజకీయాలను కలుషితం చేస్తున్నారనీ..

Updated : 04 Mar 2022 19:17 IST

అమరావతి: అమరావతి రైతులు, మహిళల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని సినీ నటుడు శివాజీ అభినందించారు. పారిశ్రామికవేత్తలే రాజకీయాలను కలుషితం చేస్తున్నారనీ.. వారు దూరంగా ఉంటే దేశానికి ఎలాంటి సమస్యలూ రావన్నారు. అమరావతిపై హైకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మందడంలో రైతులు నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘వైకాపాలోని 49మంది ఎమ్మెల్యేలు, 9మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్‌లో ఉన్నారు. ప్రత్యేక హోదాపై సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు  దారుణంగా ఉన్నాయి. మూడు రాజధానులంటూ సీఎం జగన్‌ ఎన్నికలకు వెళ్తారు. విశాఖ ఉక్కు, అమరావతి, ప్రత్యేక హోదా ఏమైందని మనం ప్రశ్నించాలి. ఓటుకు రూ.50వేలు ఇచ్చినా ఈసారి వైకాపా గెలిచే పరిస్థితి లేదు’’ అని వ్యాఖ్యానించారు. 

అమరావతి విజయం ముమ్మాటికీ మహిళలదేనని తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత అన్నారు. విజయోత్సవ సభలో ఆమె మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పును గౌరవించి రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

 

శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న అమరావతి రైతులు

ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ అమరావతి రైతులు తిరుపతిలోని అలిపిరి వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి పాదాల చెంత టెంకాయలు కొట్టారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్దకు చేరుకొని దర్శించుకోనున్నారు. గతంలో ‘న్యాయస్థానం టు దేవస్థానం’ పేరిట తాడేపల్లి నుంచి తిరుపతి వరకు పాదయాత్ర చేపట్టిన రైతులు.. అమరావతిపై హైకోర్టులో అనుకూలంగా తీర్పు వస్తే స్వామివారికి కొబ్బరికాయలు కొడతామంటూ మొక్కుకున్న నేపథ్యంలో ఈరోజు పలువురు రైతులు తిరుమలకు వచ్చారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని