Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
గువాహటి: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, రెబల్ వర్గం మధ్య పరస్పర ఆరోపణలు చర్చనీయాంశం అవుతున్నాయి. అయితే శుక్రవారం రెండు వర్గాల మధ్య పరస్పర భావోద్వేగాలతో కూడిన అంశాలు చోటుచేసుకున్నాయి. గత కొన్ని రోజులుగా ఆరోగ్యం బాగాలేదని, నా తల, మెడ, పాదాల వరకు మొత్తం నొప్పిగా ఉంది అని సీఎం ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) వ్యాఖ్యానించిన నేపథ్యంలో రెబల్ వర్గం నుంచి ఓ వీడియో బయటికి వచ్చింది. ఏక్నాథ్ శిందే ( Eknath Shinde) గ్రూప్‌లో ఉన్న రెబల్ ఎమ్మెల్యే యామిని జాదవ్ (Yamini Jadhav) ఆ వీడియోలో మాట్లాడుతూ తాను గత అక్టోబర్‌లో క్యాన్సర్ బారిన పడినా ఇంతవరకు శివసేన అధిష్ఠానం పట్టించుకోలేదని ఆమె భావోద్వేగపూరిత ప్రసంగం చేశారు. ఆ వీడియోను ఏక్నాథ్ శిందే తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు.
ఎమ్మెల్యేలైన భార్యాభర్తలు యశ్వంత్ జాదవ్, యామిని జాదవ్.. శిందే ఆధ్వర్యంలోని రెబల్ క్యాంపులో గువహటిలో ఉన్నారు. ఈ సందర్భంగా యామిని మాట్లాడుతూ.. తానెందుకు రెబల్ క్యాంపులో చేరానో చెప్పుకొచ్చారు. ‘గతేడాది అక్టోబర్ నుంచి నేను క్యాన్సర్‌తో బాధపడుతున్నా. కానీ పార్టీ పెద్దలు నన్ను పట్టించుకోలేదు. నాకు కేన్సర్ అని తెలిశాక ముంబయి మేయర్ కిశోర్ పెడ్నేకర్ పలుమార్లు పరామర్శించారు. కానీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేతోపాటు పార్టీ పెద్దలు మాత్రం నా ఆరోగ్యం గురించి కనీసం అడగలేదు’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.
జిల్లా అధ్యక్షులతో ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం భేటీ అయ్యారు. పార్టీని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అసమ్మతి నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వెళ్లిపోయిన వారి గురించి తానెందుకు బాధపడతానన్నారు. ‘శివసేనను విడిచిపెట్టడం కంటే మరణించడం మేలని మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు పారిపోయారు. నా తల, మెడ, పాదాల వరకు మొత్తం నొప్పిగా ఉంది. కొంతమంది నేనిక కోలుకోలేనుకుంటున్నారు. కానీ నేను నా గురించి ఆలోచించుకోవడం లేదు’ అంటూ ఠాక్రే ఉద్వేగంగా మాట్లాడారు. వర్ష (అధికారిక నివాసం) వదిలి వచ్చినంత మాత్రన పోరాటాన్ని వదిలేసినట్లు కాదన్నారు. తనకు పదవుల పట్ల వ్యామోహం లేదని, ముఖ్యమంత్రిని అవుతానని ఏనాడూ ఊహించలేదని పేర్కొన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Eknath Shinde : శివసేన కోసం కొత్త భవనం నిర్మించనున్న శిందే వర్గం..?
-
India News
‘లంచం లేదంటే మంచం’.. కర్ణాటక మాజీ మంత్రి వ్యాఖ్యలపై దుమారం!
-
Politics News
Telangana News: అక్కడెందుకు సీఎం కేసీఆర్ పర్యటించలేదు?: కోదండరామ్
-
India News
Modi: మిమ్మల్ని కలుసుకోవాలని అప్పుడే అనుకున్నాను..!
-
Crime News
Telangana News: కామారెడ్డిలో ఆర్టీసీ బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు
-
Sports News
Team india: ఆ ఇద్దరిలో ఎవరిని తుదిజట్టులో ఆడిస్తారో.. : మాజీ క్రికెటర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Rishi Sunak: ఆయన నా ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు: రిషి సునాక్
- Offbeat: ఆ విమానంలో జర్నీ కేవలం ఒక్క నిమిషమే.. ధరెంతో తెలుసా..?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (13/08/2022)
- Best catches: విండీస్ ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్.. ఒకే మ్యాచ్‌లో మూడు సంచలన క్యాచ్‌లు!
- Himanta Biswa Sarma: ఆమిర్ ఖాన్.. మీరు మా రాష్ట్రానికి ఆగస్టు 15 తర్వాతే రండి..!
- Ranveer singh: న్యూడ్ ఫొటోషూట్.. రణ్‌వీర్‌సింగ్ ఇంటికి పోలీసులు!
- SCR: చుట్టూ చూడొచ్చు.. చుక్కలూ లెక్కెట్టొచ్చు.. ద.మ.రైల్వేలో తొలి రైలు
- F3: ‘ఎఫ్-3’.. వెంకీ ఎలా ఒప్పుకొన్నాడో ఏంటో: పరుచూరి గోపాలకృష్ణ
- Karthikeya 2 Review: రివ్యూ: కార్తికేయ-2
- Salman Rushdie: కన్ను కోల్పోవచ్చు.. చేతుల్లో నరాలు తెగిపోయాయి..!