AAP: దిల్లీలో విక్టరీ.. ఆప్‌ చూపు ఇప్పుడు బెంగళూరు వైపు!

దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో భాజపా ఏకఛత్రాధిపత్యానికి బ్రేకులు వేసిన ఉత్సాహంలో ఉన్న ఆప్‌ ఇప్పుడు బెంగళూరు వైపు చూస్తోంది.

Published : 08 Dec 2022 01:47 IST

బెంగళూరు: దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో భాజపా ఏకఛత్రాధిపత్యానికి బ్రేకులు వేసిన ఉత్సాహంలో ఉన్న ఆప్‌ ఇప్పుడు బెంగళూరు వైపు చూస్తోంది. భాజపాను ఓడించే సత్తా తమకే ఉందని, బెంగళూరులో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఇలాంటి ప్రభావమే చూపించాలని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు. దిల్లీలో మొత్తం 250 సీట్లకు జరిగిన పురపాలక ఎన్నికల్లో ఆప్‌ 134 సీట్లు సాధించి భాజపాకు గట్టిషాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలపై ఆప్‌ బెంగళూరు అధ్యక్షుడు మోహన్‌ దాసరి స్పందించారు. ‘‘భాజపాను ఆప్‌ తప్ప ఏ రాజకీయ పార్టీ ఓడించలేదు. దిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపు యావత్‌ దేశానికి ఓ సందేశం ఇచ్చింది.. భాజపాను ఓడించేందుకు ఆప్‌ బలపడాలి. మా పార్టీ బలోపేతం కావడం వల్ల భాజపాను అధికారం నుంచి గద్దె దించి ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలవుతుంది. బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ) ఎన్నికలు ఎప్పుడు జరిగినా బెంగళూరు ఓటర్ల నుంచి ఇదేరకమైన స్పందన పొందేందుకు ఆప్‌ సిద్ధంగా ఉంది. సీఎం కేజ్రీవాల్‌ సారథ్యంలోని ప్రభుత్వ పనితీరు చూసి అక్కడి ప్రజలు ఆప్‌కు ఓటువేశారు.. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు ఆప్‌ వైపు ఆకర్షితులవుతున్నారు’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని