బడాయి ప్రతిజ్ఞ కాదు.. ఇది కేజ్రీవాల్‌ మాట..!

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడ పాగా వేసేందుకు ఆమ్‌ఆద్మీ పార్టీ చురుగ్గా పావులు కదుపుతోంది. చండీగఢ్‌లో ఇవాళ పర్యటించిన ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్‌ హామీల వర్షం...

Updated : 30 Jun 2021 12:46 IST

చండీగఢ్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడ పాగా వేసేందుకు ఆమ్‌ఆద్మీ పార్టీ చురుగ్గా పావులు కదుపుతోంది. చండీగఢ్‌లో ఇవాళ పర్యటించిన ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్‌ పంజాబ్‌ ప్రజలకు పలు హామీలు ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే 24 గంటలూ కరెంటు అందిస్తామన్నారు. అంతేకాకుండా గృహ అవసరాల కోసం 300 యూనిట్ల వరకు ఉచితంగా వాడుకోవచ్చన్నారు. పంజాబ్‌ పర్యటన నేపథ్యంలో నిన్న సాయంత్రం కేజ్రీవాల్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నారు. కానీ, ఇవాళ చండీగఢ్‌లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందిస్తాం. దీని వల్ల దాదాపు 77 నుంచి 80 శాతం మందికి అసలు కరెంటు బిల్లులే రావు. ఇది కేజ్రీవాల్‌ మాట. ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌లాంటి బడాయి ప్రతిజ్ఞ కాదు. ఆయన ఇచ్చిన హామీలేవీ గత ఐదేళ్లలో నెరవేర్చలేదు.’’ అని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్నారు. అయితే 24 గంటల కరెంటు ఇచ్చేందుకు మాత్రం మరో మూడు సంవత్సరాలు పడుతుందని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని