బట్టలుతికిన అన్నాడీఎంకే అభ్యర్థి.. వీడియో వైరల్‌

ఓటర్ల కరుణ కోసం అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. తమిళనాడులోని నాగపట్టణంలో అన్నాడీఎంకే తరఫున పోటీ చేస్తున్న తంగకత్తిరవన్‌ అనే అభ్యర్థి ఓ ఇంట్లో బట్టలు ఉతికి అందరినీ ఆశ్యర్యపరిచారు....

Published : 24 Mar 2021 02:11 IST

చెన్నై: ఓటర్ల కరుణ కోసం అభ్యర్థులు పడరాని పాట్లు పడుతున్నారు. తమిళనాడులోని నాగపట్టణంలో అన్నాడీఎంకే తరఫున పోటీ చేస్తున్న తంగకత్తిరవన్‌ అనే అభ్యర్థి ఓ ఇంట్లో బట్టలు ఉతికి అందరినీ ఆశ్యర్యపరిచారు. ఇంటింటి ప్రచారం చేపట్టిన తంగకత్తిరవన్‌.. ఓ ఇంట్లో మహిళ దుస్తులు ఉతుకుతుండగా ఆమెకు బదులు ఆయనే ఉతికేశారు. తంగకత్తిరవన్‌ దుస్తులు ఉతుకుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. అన్నాడీఏంకే మరోసారి అధికారంలోకి వస్తే వాషింగ్‌ మిషన్లను ఇస్తామని ఎన్నికల ప్రాణాళికలో హామీ ఇచ్చింది. ఆ హామీ కచ్చితంగా నెరవేరుస్తామనే ఉద్దేశంతోనే తమ నేత ఇలా బట్టలు ఉతికినట్లు ఆయన అనుచరులు పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని