Published : 24 Mar 2022 01:18 IST

తెరాస నాయకులు, సంపన్నుల భూములను ప్రభుత్వం లాక్కోగలదా?: దాసోజు శ్రవణ్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం ప్రజల ఆస్తులు అమ్మడం సామాజిక నేరమని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. తెలంగాణ సర్కార్ రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌లా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం పేదల భూములు లాక్కోవడం దారుణమన్నారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో దాసోజు మాట్లాడారు. ఆత్మ గౌరవం, ఆర్థిక భద్రత కోసం గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదలకు భూములిచ్చినట్లు చెప్పారు. ఆ భూములను కూడా తెరాస ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్ గద్దలా లాక్కుంటోందని మండిపడ్డారు. తెరాస నాయకులు, సంపన్నుల భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇలానే లాక్కోగలదా? అని ప్రశ్నించారు. తెరాస నాయకుల వద్ద ఉన్న అసైన్డ్‌ భూములు లాక్కొనే దమ్ము సీఎం కేసీఆర్‌కి ఉందా? అని నిలదీశారు.

‘‘తెలంగాణ సర్కార్‌ సందుకో బారు పెట్టి ఖజానా నింపుకుంటొంది. మరోవైపు పేదల భూములు లాక్కుంటోంది. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదు. సీఎం కేసీఆర్ భూమి ఇవ్వకపోగా ఉన్న భూములను కూడా గుంజుకోవాలని చూస్తున్నారు. అమ్మడానికి, వెంచర్లు వేయాడానికి తెలంగాణ రాష్ట్రం ఎమైనా కేసీఆర్ సొంత ఆస్తా?గతంలో కబ్జాదారులు ప్రభుత్వ భూములను కబ్జా చేసేవారని, ఇవాళ ప్రభుత్వమే కబ్జా చేస్తోంది. ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు’’ అని దాసోజు శ్రవణ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts