దినకరన్‌తో ఒవైసీ దోస్తీ

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన ఉత్సాహంలో ఉన్న అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం తమిళనాడు ఎన్నికల్లోనూ బరిలో నిలుస్తోంది. తమిళనాట.........

Updated : 09 Mar 2021 05:43 IST

మూడు స్థానాల నుంచి ఎంఐఎం పోటీ

చెన్నై: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన ఉత్సాహంలో ఉన్న అసదుద్దీన్‌ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎం తమిళనాడు ఎన్నికల్లోనూ బరిలో నిలుస్తోంది. తమిళనాట దినకరన్‌కు చెందిన ఏఎంఎంకేతో పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తులో భాగంగా ఎంఐఎంకు మూడు స్థానాలు కేటాయించారు. దీంతో వాణియంబాడి, కృష్ణగిరి, శంకరపురం స్థానాల నుంచి ఎంఐ​​ఎం అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం.. ఏఎంఎంకే లేదా డీఎంకేతో పొత్తు పెట్టుకుంటుందని ఊహాగానాలు వచ్చాయి. అయితే, డీఎంకే కూటమిలో ఇప్పటికే భాగస్వామి పార్టీలుగా ఉన్న ఐయూఎంఎల్‌, ఎంఎంకేలతో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో దినకరన్‌ పార్టీతోనే కలిసి వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. తమిళనాడు ఎంఐఎం అధ్యక్షుడు వకీల్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. తాము మూడు స్థానాల నుంచి పోటీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. తమ కూటమి అభ్యర్థుల గెలుపుకోసం కష్టపడి పని చేస్తామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని