NCP : శరద్‌ పవార్‌ వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి.. స్పీకర్‌ను కోరిన అజిత్‌ మద్దతుదారులు

శరద్ పవార్‌ వర్గం ఎమ్మెల్యేలపై వేటు వేయాలని అజిత్ పవార్‌ మద్దతుదారులు స్పీకర్‌ను కోరారు. 

Updated : 22 Sep 2023 16:07 IST

ముంబయి: మహారాష్ట్ర రాజకీయాలు (Maharashtra Politics) మళ్లీ వేడెక్కాయి. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని తాజాగా ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌ వర్గీయులు అసెంబ్లీ స్పీకర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అయితే అందులో శరద్‌ పవార్‌ వర్గానికి చెందిన నవాబ్‌ మాలిక్ సహా మరో ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లను మినహాయించడం గమనార్హం. అజిత్ పవార్‌ (Ajit Pawar) వర్గానికి మద్దతుగా ఉన్న దాదాపు 30 మందికిపైగా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని గతంలోనే శరద్‌ పవార్‌ (Sharad Pawar) వర్గం కోరింది.

ఎన్సీపీ జాతీయ అధ్యక్షుడిగా అజిత్‌ పవార్‌ను గుర్తించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను అక్టోబరు 6న ఎన్నికల సంఘం విచారించనుంది. మహారాష్ట్ర అసెంబ్లీలో 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలున్నారు. వారిలో 9 మంది అజిత్‌ పవార్‌తో కలిసి కొన్ని నెలల క్రితం శివసేన- భాజపా ప్రభుత్వంలో చేరారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని