UP Elections 2022: ‘అఖిలేశ్ యాదవ్.. నేటి ఔరంగజేబు’

సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌.. నేటి తరం ఔరంగజేబు అని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విరుచుకుపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్‌ కార్ఖానాలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో చౌహాన్‌ ప్రసంగిస్తూ.. ‘అఖిలేశ్‌ యాదవ్ నేటి ఔరంగజేబు...

Published : 21 Feb 2022 01:26 IST

లఖ్‌నవూ: సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌.. నేటి తరం ఔరంగజేబు అని మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విరుచుకుపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్‌ కార్ఖానాలో ఆదివారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో చౌహాన్‌ ప్రసంగిస్తూ.. ‘అఖిలేశ్‌ యాదవ్ నేటి ఔరంగజేబు. తన తండ్రికి విధేయుడిగా ఉండలేని వ్యక్తి.. ఓటర్లకు ఎలా ఉంటారు?’ అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ములాయం సింగ్‌ యాదవ్‌ స్వయంగా చెప్పినట్లు తెలిపారు. ‘ఔరంగజేబూ అదే పని చేశాడు. తన తండ్రి షాజహాన్‌ను జైలులో పెట్టాడు. అతని సోదరులను చంపాడు. అఖిలేశ్‌లా తనను ఎవరూ అగౌరవపరచలేదని ములాయం సింగ్ చెప్పారు’ అని అన్నారు.

‘అఖిలేశ్‌ పొత్తులన్నీ ఫ్లాప్‌ అయ్యాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీతో పొత్తు పెట్టుకున్నారు. ఇద్దరూ గాల్లో కలిసిపోయారు. ప్రజలు గుణపాఠం చెప్పగానే వారి స్నేహం ముగిసింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో మాయావతితో చేయి కలిపారు. అదే ఫలితం వచ్చింది. ఇప్పుడు జయంత్ చౌధరిని పట్టుకున్నారు. అఖిలేశ్‌ ఎక్కడికి వెళ్లినా వైఫల్యాలే. ఆయన ఫ్లాప్‌ సినిమాల దర్శకుడు’ అని ఎద్దేవా చేశారు. 2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో దోషుల్లో ఒకరికి సమాజ్‌వాదీతో సంబంధాలు ఉన్నాయనీ ఆరోపించారు. ఇది వారసత్వాల పార్టీ అని విమర్శించారు. ఇదిలా ఉండగా.. యూపీలో నేడు మూడో దశ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని