CM KCR: కేసీఆర్‌తో భేటీ అయిన అఖిలేశ్‌.. తాజా రాజకీయాలపై చర్చ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ఈ మధ్యాహ్నం ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో భేటీ

Updated : 21 May 2022 14:53 IST

దిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈ మధ్యాహ్నం కేసీఆర్‌తో ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ భేటీ అయ్యారు. దిల్లీలోని కేసీఆర్‌ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఇటీవల జరిగిన ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలపై ఈ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. దేశంలోని తాజా రాజకీయ పరిస్థితులు కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.

దిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్‌.. ప్రజల ఎజెండాతో జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రూపకల్పన కోసం రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి నేతలతో చర్చలు జరిపిన ఆయన తాజాగా విస్తృతస్థాయిలో దిల్లీతో పాటు పంజాబ్‌, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్రలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులు, జాతీయస్థాయి నేతలు తదితరులతో సమావేశమవుతారు. ఈ నెల  22వ తేదీన మధ్యాహ్నం దిల్లీ నుంచి చండీగఢ్‌కు వెళతారు. గతంలో ప్రకటించిన విధంగా జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 మంది రైతుల కుటుంబాలను సీఎం కేసీఆర్‌ పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేస్తారు. దాదాపు నాలుగు రోజుల పాటు కేసీఆర్‌ పంజాబ్‌లోనే ఉంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని