UP Polls: మా పార్టీ ద్వారాలు తెరిచే ఉన్నాయ్‌: అఖిలేశ్

సమాజ్ వాదీ పార్టీని విమర్శిస్తున్న కాంగ్రెస్, బీఎస్పీ ఏ పక్షమో చెప్పాలని ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్ డిమాండ్ చేశారు. వారి పోరాటం భారతీయ జనతా పార్టీపైనా.. లేక సమాజ్‌వాదీ పార్టీపైనా అన్నది స్పష్టం చేయాలన్నారు....

Published : 02 Aug 2021 01:16 IST

లఖ్‌నవూ: సమాజ్వాదీ పార్టీని విమర్శిస్తున్న కాంగ్రెస్, బీఎస్పీ ఏ పక్షమో చెప్పాలని ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్ డిమాండ్ చేశారు. వారి పోరాటం భారతీయ జనతా పార్టీపైనా.. లేక సమాజ్‌వాదీ పార్టీపైనా అన్నది స్పష్టం చేయాలన్నారు. వచ్చే ఏడాది జరిగే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో చిన్నపార్టీలతో పొత్తుకు తమ పార్టీ ద్వారాలు తెరిచే ఉంచినట్లు అఖిలేశ్‌ వెల్లడించారు. ఎన్నో చిన్న పార్టీలు ఇప్పటికే తమతో కలిసి ఉన్నాయని.. మరికొన్ని చిన్న పార్టీలు కూడా తమతో కలిసివస్తాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో భాజపాను ఓడించే దిశగా అన్ని పార్టీలను ఒకే తాటిపైకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేయనున్నట్లు అఖిలేశ్‌ తేల్చి చెప్పారు.

పెగాసస్‌ స్పైవేర్‌తో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వ తీరును అఖిలేశ్‌ తప్పుబట్టారు. లోక్‌సభలో ఎన్డీయే కూటమికి 350కి పైగా సభ్యులు ఉండటంతోపాటు.. చాలా రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇతరుల ఫోన్లు ట్యాప్‌ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కేంద్రం చర్యలు విదేశీ శక్తులకు మద్ధతిచ్చేలా ఉన్నాయని ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని