Akhilesh Yadav: విభేదాలను పక్కనపెట్టిన బాబాయ్‌ అబ్బాయ్‌..!

సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party)లో పీఎస్‌పీఎల్‌ విలీనం కానుంది. ఈ విషయాన్ని నేడు పీఎస్‌పీఎల్‌ అధినేత శివ్‌పాల్‌ సింగ్‌ యాదవ్‌ (Shivpal Singh Yadav)ప్రకటించారు.  

Published : 09 Dec 2022 01:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణమాలు చోటు చేసుకొంటున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) నుంచి వేర్పడి  ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ(లోహియా)ను స్థాపించిన శివ్‌పాల్‌ సింగ్‌ యాదవ్‌ (Shivpal Singh Yadav)శాంతించారు. గురువారం ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) సైఫైలో తన బాబాయి శివ్‌పాల్‌ను కలిసి సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) జెండాను బహూకరించారు. దీంతో శివ్‌పాల్‌ (Shivpal Singh Yadav) తిరిగి సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party)లో చేరడం ఖాయమైంది. దీనికి సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో పోస్టు చేశారు. శివ్‌పాల్‌ సింగ్‌ యాదవ్‌ కారుపై కూడా సమాజ్‌వాదీ స్టిక్కర్లు ఉన్నాయి. 

ఈ సందర్భంగా ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ(లోహియా)ను ఎస్పీలో విలీనం చేయనున్నట్లు శివ్‌పాల్‌ (Shivpal Singh Yadav) మీడియాకు వెల్లడించారు. ‘‘నేను పీఎస్‌పీఎల్‌ను సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party)లో విలీనం చేయనున్నాను. 2024లో మేం సమష్టిగా పోటీ చేస్తాం. నేటి నుంచి దానిపై(కారుపై) సమాజ్‌వాదీ పార్టీ స్టిక్కర్‌ ఉంటుంది’’ అని పేర్కొన్నారు.  

ఈ ఏడాది మార్చిలో జరిగిన రాష్ట్ర ఎన్నికల సందర్భంగా అఖిలేశ్‌ (Akhilesh Yadav) - శివపాల్‌ (Shivpal Singh Yadav) మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. భాజపా నేత, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో శివ్‌పాల్‌ భేటీ కావడం ఈ దూరాన్ని మరింత పెంచింది. కానీ, అక్టోబర్‌లో ములాయం సింగ్‌ యాదవ్‌ మరణం తర్వాత నుంచి వారి మధ్య విభేదాలు తగ్గుముఖం పట్టాయి. తాజాగా డింపుల్‌ యాదవ్‌ మైన్‌పురి బరిలో నిలవడంతో శివ్‌పాల్‌ యాదవ్‌(Shivpal Singh Yadav) ఆమె తరఫున భారీగా ప్రచారం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని