Akhilesh: వాటితో ప్రతిపక్షాల్ని టార్గెట్‌చేస్తున్నారు.. ఈసీ, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తాం!

కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష పార్టీలను టార్గెట్‌ చేసేందుకు దుర్వినియోగపరుస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ......

Published : 01 Jan 2022 01:13 IST

కేంద్రంపై అఖిలేశ్‌ యాదవ్‌ ఆగ్రహం

లఖ్‌నవూ: కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష పార్టీలను టార్గెట్‌ చేసేందుకు దుర్వినియోగపరుస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ మండిపడ్డారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ దృష్టికి తీసుకెళ్తామన్నారు. తమ పార్టీ ఎమ్మెల్సీ, సుగంధ ద్రవ్యాల వ్యాపారి పుష్పరాజ్‌ జైన్‌ నివాసంపై ఐటీ అధికారుల దాడుల నేపథ్యంలో అఖిలేశ్‌ మీడియాతో మాట్లాడారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తూ ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారో వివరిస్తూ ఈసీ, రాష్ట్రపతిలకు లేఖ రాయనున్నట్టు వెల్లడించారు.

గతంలో పొరపాటున పీయూష్‌ జైన్‌ ఇంట్లో సోదాలు జరిపారని.. ఆ తప్పును కప్పిపుచ్చుకొనే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు తమ ఎమ్మెల్సీ పుష్పరాజ్‌ జైన్‌ ఇంట్లో దాడులు చేసినట్టు అఖిలేశ్‌ ఆరోపించారు. పన్ను ఎగవేత ఆరోపణల కేసులో పీయూష్‌ జైన్‌పై ఇటీవల దాడులు చేసి విచారించారని.. ఆయన కూడా సుగంధ ద్రవ్యాల వ్యాపారేనన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామని దిల్లీలోని భాజపా నేతలు గ్రహించారని, అందుకే ఐటీ దాడులకు పాల్పడుతున్నారంటూ అఖిలేశ్‌ యాదవ్‌ వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని