Akhilesh Yadav: భాజపాను గద్దె దించేది ‘ఎర్ర టోపీ’లే!

ఉత్తరప్రదేశ్‌లో భాజపాను గద్దె దించేది ‘ఎర్ర టోపీ’నేనని సమాజ్‌వాది పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. యూపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనన్న నేపథ్యంలో మంగళవారం ప్రధాని మోదీ.. సమాజ్‌వాది పార్టీని టార్గెట్‌ చేసి విమర్శలు చేశారు. ఆ పార్టీ నేతలు ధరించే ఎర్ర టోపీలను అధికారుల కార్లపై

Published : 09 Dec 2021 01:42 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో భాజపాను గద్దె దించేది ‘ఎర్ర టోపీ’లేనని సమాజ్‌వాది పార్టీ చీఫ్‌, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. యూపీలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనన్న నేపథ్యంలో మంగళవారం ప్రధాని మోదీ.. సమాజ్‌వాది పార్టీని టార్గెట్‌ చేసి విమర్శలు చేశారు. ఆ పార్టీ నేతలు ధరించే ఎర్ర టోపీలను అధికారుల కార్లపై ఉండే ఎర్రబుగ్గతో పోల్చిన ఆయన.. అధికార దర్పం ప్రదర్శించేందుకే సమాజ్‌వాదీ ఆరాటపడుతున్న విషయాన్ని తెలియజేస్తోందన్నారు. అందుకే ఆ ఎర్ర టోపీని రెడ్‌ అలర్ట్‌గా భావించాలని యూపీ ప్రజలకు ప్రధాని మోదీ సూచించారు. కాగా.. మోదీ వ్యాఖ్యలపై అఖిలేశ్‌ యాదవ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. రెడ్‌ అలర్ట్‌ ప్రజలకు కాదని.. భాజపాకి అని అన్నారు.

‘భాజపాకి ఎర్ర టోపీలే కాకుండా చాలా రెడ్‌ అలర్ట్‌లు ఉన్నాయి. దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రైతులు.. కార్మికుల దుస్థితి, హత్రాస్.. లఖింపూర్ ఖేరీ సంఘటనలు, మహిళలు, యువకులపై అణచివేత, అస్థవ్యస్థమైన విద్యా వ్యవస్థ.. వ్యాపార, ఆరోగ్య రంగాలన్నీ రెడ్‌ అలెర్టులే. వీటితోపాటు ఈ ఎర్ర టోపీ భాజపాను అధికారంలో నుంచి దించేస్తుంది’’అని ట్వీట్‌ చేశారు. 2022లో ఎరుపు రంగు విప్లవం వస్తుందని, మార్పులు చోటుచేసుకుంటాయని అఖిలేశ్‌ యాదవ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Read latest Political News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని