UP Polls: వారిద్దరిపై ఐపీసీలో సెక్షన్ల కంటే ఎక్కువ ఆరోపణలున్నాయ్‌..!

తాము అధికారంలోకి వస్తే ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంలపై ఉన్న ఆరోపణలపై కేసులు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ పేర్కొన్నారు.

Published : 02 Feb 2022 22:43 IST

లఖ్‌నవూ: తాము అధికారంలోకి వస్తే ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎంలపై ఉన్న ఆరోపణలపై కేసులు నమోదు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ పేర్కొన్నారు. భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లో ఉన్న కేసుల కంటే వారిద్దరిపైన ఉన్న ఆరోపణలే ఎక్కువని అన్నారు. ఇక రాష్ట్రంలో ఎస్‌పీ-ఆర్‌ఎల్‌డీ (రాష్ట్రీయ లోక్‌దళ్‌) కూటమికి పెరుగుతున్న ప్రజామద్దతు చూసి భాజపా కలవరపడుతోందని అన్నారు.

‘ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై ఎవరైనా పిటిషన్‌ దాఖలు చేస్తే కేసులు నమోదుపై పునపరిశీలిస్తాం’ అని ఎస్‌పీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ వెల్లడించారు. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తున్న పార్టీలు.. ప్రత్యర్థి పార్టీల్లో అసంతృప్తితో ఉన్న వారికి తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవలే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. సమాజ్‌వాదీ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ఆయన.. ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో కిడ్నాప్‌లు, దోపిడీలు, అల్లర్లు, దొంగతనాలు, మాఫియా పాలనే సాగేదని, దాన్నుంచి యోగి ఆదిత్యనాథ్‌ రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని