Akhilesh Yadav: ఆ లెక్కన చూస్తే మేం 304 సీట్లు‌ గెలిచాం: అఖిలేశ్‌

యూపీ ఎన్నికల ఫలితాలపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ మరోసారి ట్విటర్‌ వేదికగా స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీ సారథ్యంలోని....

Published : 15 Mar 2022 17:14 IST

లఖ్‌నవూ: యూపీ ఎన్నికల ఫలితాలపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ మరోసారి ట్విటర్‌ వేదికగా స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీ సారథ్యంలోని తమ కూటమి పోస్టల్‌ బ్యాలెట్‌లో 51.5శాతం ఓట్లు సాధించిందని పేర్కొన్నారు. దీన్నిబట్టి చూస్తే తాము 304 సీట్లు గెలుచుకున్నట్టు లెక్క అని తెలిపారు. ‘‘ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కూటమికి 51.5శాతం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వచ్చాయి. దీని ప్రకారం తమ కూటమి 304 సీట్లలో విజయం నమోదు చేసిందన్న వాస్తవాన్ని తెలియచేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మోసం బలం కాదనే విషయాన్ని అధికార పార్టీ తెలుసుకోవాలి’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన పోరులో సమాజ్‌వాదీ పార్టీ గట్టి పోటీ మోదీ-యోగి వ్యూహాల ముందు నిలబడలేకపోయింది. ఈ ఎన్నికల్లో భాజపా 255 సీట్లతో భారీ విజయం సాధించి వరుసగా రెండోసారి అధికార పీఠం నిలుపుకోగా.. సమాజ్‌వాదీ పార్టీ 111 స్థానాలతో బలం పుంజుకొంది. సమాజ్‌వాదీ పార్టీ మిత్రపక్షమైన ఆర్‌ఎల్‌డీకి ఎనిమిది సీట్లు వచ్చాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని