Gujarat Polls: ఎన్నికల్లో గెలిస్తే.. ‘మీసాల చట్టం’ కోసం పోరాడతా..!
పొడవాటి మీసాలు పెంచుకునే వారికి ప్రభుత్వం ప్రత్యేక భత్యం అందించాలని గుజరాత్‌కు చెందిన ఓ ఆర్మీ రిటైర్డ్ అధికారి కోరుతున్నారు. తాను ఎన్నికల్లో గెలిస్తే మీసాలు పెంచుకునేందుకు యువతను ప్రోత్సహించేలా చట్టాన్ని తెచ్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని ఈ స్వతంత్ర అభ్యర్థి హామీ ఇస్తున్నారు.
హిమ్మత్‌నగర్: ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ నాయకులు ఇవ్వని హామీ ఉండదు. సంక్షేమ పథకాలు మొదలు అభివృద్ధి కార్యక్రమాల వరకు ఉచిత హామీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తారు. కానీ, గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం మీసాలపైనే (Moustache) దృష్టిపెట్టారు. పొడవాటి మీసాలు పెంచుకునే వారందరికీ ప్రభుత్వం ప్రత్యేక భత్యం అందించాలని కోరుతున్న ఆయన.. తాను ఎన్నికల్లో గెలిస్తే పొడవాటి మీసాలు పెంచుకునేలా యువతను ప్రోత్సహించేందుకు చట్టాన్ని తేవడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని చెప్పడం గమనార్హం.
మంగన్‌భాయ్ సోలంకి గుజరాత్‌లోని సబర్కాంత జిల్లాకు చెందిన వ్యక్తి. 2012లో ఆర్మీ నుంచి పదవీ విరమణ పొందారు. ఆయనకు (Maganbhai Solanki) యుక్త వయసు నుంచే మీసాలు పెంచుకునే అలవాటు ఉంది. ఆయన మీసాల పొడవు ఇరువైపుల కలిపి సుమారు 5 అడగులు (2.5అడుగుల చొప్పున) ఉంటాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో హిమ్మత్‌నగర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే, మీసాలే అజెండాగా తాజా ఎన్నికల్లో ఆయన ప్రచారం చేస్తున్నారు.
‘ఆర్మీలో ఉన్నప్పుడు నా రెజిమెంట్‌లో మీసాల వ్యక్తిగా (Moochwala) ప్రాచుర్యం పొందా. నా మీసాలే నాకు గర్వకారణం. ప్రజల్లోనూ ఇవి గుర్తింపు తెచ్చాయి. మీసాలు పెంచుకునే వారికి ప్రభుత్వం ప్రత్యేక భత్యం అందించాలి. నా మీసాల నిర్వహణ కోసం ప్రభుత్వం నుంచి ప్రత్యేక భత్యం కూడా పొందా’ అని మంగన్‌భాయ్ సోలంకి పేర్కొన్నారు.
2017లో రాజకీయాల్లోకి వచ్చిన సోలంకి (Maganbhai Solanki).. తొలుత బీఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2019 లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. మీసాలు పెంచడంపై యువతను ప్రోత్సహించడంతోపాటు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల సమస్యలపైనా పోరాటం కొనసాగిస్తానని చెబుతున్నారు. మీసాలు పెంచడం తన తండ్రి నుంచి స్ఫూర్తి పొందానని చెబుతున్న సోలంకి.. ఎన్నికల్లో గెలిచే వరకూ పోటీ చేస్తూనే ఉంటానని చెప్పడం గమనార్హం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Team India Final XI: గిల్ ఉంటాడా.. సూర్య వస్తాడా.. కీపర్ ఎవరు.. స్పిన్నర్ లెక్కేంటి?
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
India News
Modi: ఆ దశాబ్ద కాలాన్ని మనం కోల్పోయాం.. విపక్షాలపై మోదీ ఫైర్
-
General News
Hyderabad: వాహనదారులకు అలర్ట్.. ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఖైరతాబాద్ కూడలి
-
World News
Turkeys earthquake: తుర్కియేలో భూకంప పన్ను ఏమైంది..? ప్రజల ఆగ్రహం..!
-
Politics News
Harish Rao: భాజపా ‘అమృత్కాల్’.. దేశ ప్రజలకు ఆపద కాలం: హరీశ్‌రావు