Updated : 08/12/2021 17:21 IST

Mamata Banerjee: భవానీపూర్‌ 17వ రౌండ్‌ పూర్తి.. ఆధిక్యంలో దూసుకెళ్తున్న దీదీ!

కోల్‌కతా: భవానీపూర్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో ముఖ్యమంత్రి మమతాబెనర్జీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 17వ రౌండ్‌ ముగిసే సమయానికి భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై దీదీ 45 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మమతకు 67,620 ఓట్లు రాగా.. టిబ్రేవాల్‌ 21,882, సీపీఐ(ఎం) 2896 ఓట్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. భవానీపూర్‌ సహా పశ్చిమ బెంగాల్‌లో మూడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న విషయం తెలిసిందే. మిగిలిన రెండు స్థానాలైన షంసేర్‌గంజ్‌, జాంగీపూర్‌లోనూ తృణమూల్‌ అభ్యర్థులే ఆధిక్యంలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఓడిపోయిన మమతా బెనర్జీ.. ఈసారి భవానీపూర్‌ నుంచి బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఆమెపై భాజపా తరఫున ప్రియాంక టిబ్రేవాల్‌, సీపీఐ(ఎం) నుంచి శ్రీజిబ్‌ బిశ్వాస్‌ పోటీలో ఉన్నారు. సీఎం పీఠాన్ని కాపాడుకోవడానికి భవానీపూర్‌ నుంచి విజయం సాధించడం మమతకు తప్పనిసరి. మరోవైపు ఒడిశాలోని పూరి జిల్లాలో ఉన్న పిపిలి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని