BRS: నాందేడ్‌లో భారాస బహిరంగ సభకు సర్వం సిద్ధం

నాందేడ్‌ (Nanded)లో భారాస (BRS) చేపడుతున్న బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించారు.

Published : 04 Feb 2023 19:47 IST

నాందేడ్‌: మహారాష్ట్ర (Maharashtra)లోని నాందేడ్‌ (Nanded)లో భారాస (BRS) ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ఆదివారం జరగనున్న బహిరంగసభ వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నాందేడ్ పట్టణానికి నలువైపులా కిలోమీటర్ల మేర గులాబీ రంగు సంతరించుకుంది. వరుస క్రమంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. భారాస అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో.. సభ ఏర్పాట్లను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. భారాసగా పార్టీ రూపాంతరం చెందిన తర్వాత జాతీయస్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో అధిష్ఠానం దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు జోగు రామయ్య, షకీల్‌, టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌ గాదరి బాలమల్లు, పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ రవీందర్‌ సింగ్‌ తదితరులు గత కొన్ని రోజులుగా ఇక్కడే ఉంటూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు