పంచాయతీ ఎన్నికల్లో ‘నోటా’: ద్వివేది

రేపు జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల

Updated : 08 Feb 2021 17:36 IST

అమరావతి: రేపు జరగనున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. కొవిడ్‌ రోగులు పోలింగ్‌ చివరి గంటలో ఓటు వేసేందుకు రావాలని సూచించారు. ఎన్నికల ఏర్పాట్లపై పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌తో కలిసి ద్వివేది మీడియాతో మాట్లాడారు. 

పోలింగ్‌ జరిగే తీరును వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పర్యవేక్షిస్తామని ద్వివేది చెప్పారు. ఎన్నికల్లో తొలిసారిగా నోటా ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. నోటాకు వచ్చే ఓట్లు లెక్కించబోమని ఆయన స్పష్టం చేశారు. తొలి విడతలో 12 జిల్లాల్లోని 3,249 పంచాయతీలగాను 525 చోట్ల.. 32,502 వార్డు మెంబర్లకి 12,185 చోట్ల ఏకగ్రీవమైనట్లు తెలిపారు. రేపు రాష్ట్రవ్యాప్తంగా 2,724 సర్పంచ్‌ స్థానాలు, 20,157 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఏకగ్రీవాలపై చిత్తూరు కలెక్టర్‌ నుంచి నివేదిక వచ్చిందని.. గుంటూరు కలెక్టర్‌ నుంచి ఇంకా రావాల్సి ఉందని వివరించారు. ఆ రెండు జిల్లాల్లో జరిగిన ఏకగ్రీవాలపై ఎస్‌ఈసీ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ద్వివేది చెప్పారు. 

ఇవీ చదవండి..

అందుకే పాకిస్థాన్‌కు నిద్రపట్టడం లేదు: కిషన్‌రెడ్డి 

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని