సీబీఐపై కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు.. సమ్మతి ఉపసంహరించుకోవాలని రాష్ట్రాలకు పిలుపు

సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారాలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు.

Published : 01 Sep 2022 02:48 IST

పట్నా: సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారాలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. రాజకీయంగా కక్ష సాధింపుల కోసం కేంద్రంలోని భాజపా సర్కారు వీటిని ఉపయోగిస్తోందని దుయ్యబట్టారు. ఈ తరహా దాడులు ఆగాలంటే సీబీఐకిచ్చిన సమ్మతిని అన్ని రాష్ట్రాలూ ఉపసంహరించుకోవాలన్నారు. బిహార్‌ పర్యటనలో భాగంగా బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌తో కలిసి  బుధవారం విలేకరులతో మాట్లాడిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీసింగ్‌ అంశం రాష్ట్రాల పరిధిలోనిదని పేర్కొన్నారు. బిహార్‌లో అధికారంలో ఉన్న మహా కూటమి నేతలు సైతం ఇదే తరహా డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

దిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌, 1946 సెక్షన్‌ ప్రకారం.. ఏదైనా రాష్ట్రంలో దర్యాప్తు నిర్వహించాలంటే సీబీఐ ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఒకవేళ రాష్ట్రాలు తమ సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటే ఆ రాష్ట్ర పరిధిలో ఏదైనా కేసు నమోదు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, మేఘాలయ సహా 9 రాష్ట్రాలు ఈ తరహా సమ్మతిని ఉపసంహరించుకున్నాయి. గతంలో ఏపీ ప్రభుత్వం సైతం సమ్మతిని ఉపసంహరించుకుంది. తాజాగా సీఎం కేసీఆర్‌ సైతం ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని