Congress: కేంద్రం తీసుకున్న నిర్ణయాలన్నీ అంతే..: కాంగ్రెస్‌

ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన నియామకాలతో పాటు ఇతరులను సంప్రదించకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ భారత రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా ఉన్నాయని కాంగ్రెస్‌ ఆరోపించింది.

Published : 25 Nov 2022 01:11 IST

దిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన నియామకాలతో పాటు ఇతరులను సంప్రదించకుండా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ భారత రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచేలా ఉన్నాయని కాంగ్రెస్‌ ఆరోపించింది. కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయల్‌ నియామకంపై సుప్రీంకోర్టు ప్రశ్నలు లేవనెత్తడాన్ని ఈ సందర్భంగా ఉటంకించింది. కేవలం ఇదొక్కటే కాదని.. దాదాపు మోదీ తీసుకున్న నిర్ణయాలన్నీ అలాగే ఉన్నాయని విమర్శించింది. ఈ మేరకు ఏఐసీసీ మీడియా కార్యదర్శి పవన్‌ ఖేరా ఆరోపించారు. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలను పక్కన పెట్టేసిందని, ఏ కీలక నిర్ణయం తీసుకున్నా ప్రతిపక్షాల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోకుండా ముందుకెళ్తోందని ధ్వజమెత్తారు.

కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా అరుణ్‌ గోయల్‌ నియామకంపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు బుధవారం వివరణ కోరిన విషయం తెలిసిందే. ఏ ప్రాతిపదికన ఆయన నియామకం జరిగిందో కోర్టుకు తెలపాలని ఆదేశించింది. ఈ నియామకం వెనుక ఎలాంటి ఉద్దేశాలూ లేవని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి  పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. నియామకాల ప్రక్రియపై విచారణ చేస్తున్నప్పుడే గోయల్‌ నియామకమూ జరిగిందని, అందువల్ల ప్రక్రియ గురించి తెలుసుకోవడంలో తప్పేముందని జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని