Pawan kalyan: డిప్యూటీ సీఎం పవన్‌కు అమరావతిలో ఘనస్వాగతం

అమరావతిలో అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు రాజధాని ప్రాంత రైతుల నుంచి ఘన స్వాగతం లభించింది.

Updated : 18 Jun 2024 17:36 IST

అమరావతి: అమరావతిలో అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు రాజధాని ప్రాంత రైతుల నుంచి ఘన స్వాగతం లభించింది. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు వద్దకు వాహనశ్రేణి చేరుకోగానే భారీ గజమాలతో పవన్‌ను సత్కరించారు. వెంకటపాలెం నుంచి మందడం వరకు దారి పొడవునా పూలు చల్లుతూ నీరాజనాలు పలికారు. రాజధాని రైతులు, ప్రజలు, అభిమానులకు అభివాదం చేస్తూ జనసేనాని ముందుకు సాగారు. అనంతరం పవన్‌ వెలగపూడి సచివాలయానికి చేరుకున్నారు. తొలిసారి సచివాలయానికి వచ్చిన ఆయనకు ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. 

సీఎం చంద్రబాబుతో పవన్‌ భేటీ..

సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌ ఈ భేటీలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత తొలి భేటీలో వివిధ అంశాలపై చర్చించినట్టు సమాచారం. రెండో బ్లాక్‌లోని తన ఛాంబర్‌ను పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి రాగా.. పెద్ద ఎత్తున ఉద్యోగులు, అభిమానులు గుమిగూడటంతో ఛాంబర్‌ల పరిశీలనకు పవన్‌ వెళ్లలేకపోయారు. బుధవారం ఉదయం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని