Nara Bhuvaneshwari: అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది: నారా భువనేశ్వరి

వైకాపా ప్రభుత్వం అడ్డదారిలో వెళ్తోందని.. ధైర్యంగా ఎదుర్కోవాలని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రజలకు పిలుపునిచ్చారు. 

Updated : 03 Oct 2023 16:02 IST

రాజమహేంద్రవరం: వైకాపా ప్రభుత్వం అడ్డదారిలో వెళ్తోందని.. ధైర్యంగా ఎదుర్కోవాలని తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ప్రజలకు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలో నారా భువనేశ్వరిని రాజధాని అమరావతి రైతులు కలిశారు. ఈ సందర్భంగా ఆమె వారితో మాట్లాడుతూ.. ‘‘రైతుల త్యాగాలు వృథా కావు. అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది. క్లిష్ట సమయంలో ప్రజల మద్దతు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఓట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అదే మన ఆయుధం’’ అని భువనేశ్వరి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని