Chandrababu: అమరావతే నిలుస్తుంది.. అమరావతే గెలుస్తుంది.. ఇదే ఫైనల్: చంద్రబాబు

ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగింది. ఈ విషయాన్ని గుర్తుచేస్తూ తెదేపా అధినేత చంద్రబాబు.. వైకాపా తీరుపై మండిపడ్డారు.

Published : 22 Oct 2022 10:57 IST

అమరావతి: రైతుల మహా పాదయాత్రపై వైకాపా కుతంత్రాలు సాగవని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరించారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున(అక్టోబరు 22) ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించామని.. కానీ, ప్రస్తుత పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనం అయిందని ఆయన మండిపడ్డారు.

‘‘అమరావతి అంటే 28వేల మంది రైతుల త్యాగం.. కోట్ల మంది సంకల్పం. ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రులు అమరావతిని తమకు గర్వకారణంగా భావించారు. ఎన్నికల ముందు దీన్ని స్వాగతించిన వ్యక్తి.. అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేశారు. ఆంధ్రుల రాజధాని ఎప్పటికీ అమరావతే. అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుంది. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరుతుంది. సత్యం, న్యాయం, త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే నిలుస్తుంది. అమరావతే గెలుస్తుంది.. ఇదే ఫైనల్’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని