Amit Shah: తెలంగాణ, పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తాం: అమిత్‌షా

ప్రతి విషయంలోనూ కాంగ్రెస్‌ పార్టీ ప్రతికూల రాజకీయాలు చేస్తోందని.. ఆ పార్టీ ఎప్పుడూ భ్రమల్లోనే ఉంటుందని భాజపా అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్‌షా విమర్శించారు. ..

Published : 03 Jul 2022 13:42 IST

హైదరాబాద్‌: ప్రతి విషయంలోనూ కాంగ్రెస్‌ పార్టీ ప్రతికూల రాజకీయాలు చేస్తోందని.. ఆ పార్టీ ఎప్పుడూ భ్రమల్లోనే ఉంటుందని భాజపా అగ్రనేత, కేంద్రహోంమంత్రి అమిత్‌షా విమర్శించారు. నగరంలోని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న భాజపా కార్యవర్గ సమావేశాల్లో భాగంగా ఆయన రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అమిత్‌షా మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. 

కశ్మీర్‌ అంశాన్ని అంతర్జాతీయంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కొవిడ్‌, సర్జికల్‌ స్ట్రైక్స్‌, రాహుల్‌ను ఈడీ ప్రశ్నించడం.. ఇలా ప్రతి అంశంపైనా ప్రతికూల రాజకీయాలు చేస్తున్నారన్నారు. అవకాశవాద, అవినీతి రాజకీయాలకు కాంగ్రెస్‌ వేదికగా మారిందని విమర్శించారు. పశ్చిమబెంగాల్‌, తెలంగాణలో భాజపా అధికారంలోకి వస్తుందని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని