Amit Shah: ఆయన తండ్రి మాటే వినలేదు.. నీ మాట వింటాడా..?

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆర్‌ఎల్‌డీ పార్టీని తనవైపునకు తిప్పుకొనేందుకు భాజపా విశ్వప్రయత్నాలు చేస్తోంది.

Published : 03 Feb 2022 16:35 IST

లఖ్‌నవూ: యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆర్‌ఎల్‌డీ పార్టీని తనవైపునకు తిప్పుకొనేందుకు భాజపా విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈరోజు బులంద్‌షహర్‌లో ప్రచారం నిర్వహించిన భాజపా అగ్రనేత అమిత్‌ షా.. ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు జయంత్‌ చౌధరీని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.  జయంత్‌ను ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్ పొత్తుకు ఒప్పించారని, అయితే ఆయన మాట మాత్రం వినరన్నారు. 

‘ఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. తన గొంతు నొక్కుతుందని జయంత్ బాబుకు తెలీదు. తన తండ్రి, కుటుంబ సభ్యుల మాట వినని వ్యక్తి(అఖిలేశ్‌).. మీ మాట కూడా వినరు. అజం ఖాన్ జైలు నుంచి వస్తారు. వచ్చి అఖిలేశ్‌ యాదవ్ పక్కన కూర్చుంటారు’ అంటూ మాట్లాడారు. ఈ సందర్భంగా అఖిలేశ్‌, ఆయన తండ్రి ములాయం సింగ్ యాదవ్ మధ్య ఉన్న విభేదాలను ప్రస్తావించారు. 

 ఎస్పీతో పొత్తు సరికాదని అమిత్‌ షా.. జయంత్‌కు చెప్పడం ఇది రెండోసారి. ఇంతకు ముందు ఆయన జాట్‌ వర్గ నేతల్ని కలిసిన సమయంలో కూడా.. ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు తప్పుదారి ఎంచుకున్నారని వ్యాఖ్యానించారు. అలాగే ఆయనకు తమ పార్టీ తలుపులు తెరిచే ఉంటాయని హింట్ ఇచ్చారు. కాగా, అప్పుడు ఆ మాటలకు జయంత్‌ కౌంటర్ ఇచ్చారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించి, నష్టపోయిన 700 కుటుంబాలను పార్టీలోకి ఆహ్వానించాలని మండిపడ్డారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని